MG Astor: అత్యాధునిక భద్రతా ఫీచర్లతో ఎంజీ ఆస్టర్‌ కారు - MG Astor SUV unveiled
close

Updated : 15/09/2021 19:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MG Astor: అత్యాధునిక భద్రతా ఫీచర్లతో ఎంజీ ఆస్టర్‌ కారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్‌ ఇండియా ‘ఆస్టర్‌’ పేరిట సరికొత్త ఎస్‌యూవీని ఆవిష్కరించింది. భారత విపణిలోకి సంస్థ నుంచి వచ్చిన ఐదో ఎస్‌యూవీ ఇది. జెడ్‌ఎస్‌ విద్యుత్తు కారుకు ఐసీఈ(ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజిన్‌) వర్షనే ఆస్టన్‌గా చెప్పొచ్చు. అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. బయటి నుంచి చూస్తే డిజైన్‌పరంగా జెడ్‌ఎస్‌ ఈవీని పోలి ఉంది.

* ఎంజీ ఆస్టర్‌ ఎస్‌యూవీ పొడవు 4,323 ఎం.ఎం, వెడల్పు 1,809 ఎం.ఎం, ఎత్తు 1,653 ఎం.ఎం. 17 అంగుళాల డ్యుయల్‌ టోన్‌ అలాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. ముందు భాగంలో ఉండే గ్రిల్‌ ఆకారాన్ని మాత్రం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు.

* కారు లోపలి భాగాన్ని రెండు రంగుల థీమ్‌తో రూపొందించారు. 7 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ ఉంది. ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేతో ఆపరేట్‌ చేయొచ్చు. ఎలక్ట్రిక్‌ కార్‌ పార్కింగ్‌ బ్రేక్‌, రేర్‌ ఏసీ వెంట్స్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌, డిజిటల్‌ కీ వంటి అత్యాధునిక టూల్స్‌ ఉన్నాయి.

* ఇంజిన్‌ విషయానికి వస్తే రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి బ్రిట్‌ డైనమిక్‌ 220 టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌. ఇది 220 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ వద్ద 140 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. మరొక వేరియంట్‌ వీటీఐ టెక్‌ పెట్రోల్‌ ఇంజిన్‌. 8-స్పీడ్‌ సీవీటీ యూనిట్‌ కలిగిన మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఉంది. ఇది 144 ఎన్‌.ఎం. గరిష్ఠ టార్క్‌ వద్ద 110 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది.

* ఇందులో పొందుపరిచిన అడ్వాన్స్‌డ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీ దీని ప్రత్యేకతను చాటుతోంది. యాపిల్‌ సిరి, అమెజాన్‌ అలెక్సా వలే పనిచేసే పర్సనల్‌ ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టం, అటానమస్‌ లెవెల్‌-2 సాంకేతికత దీనికి మాత్రమే సొంతం. మ్యూజిక్‌ ప్లే, ఫోన్‌ కాల్స్‌ అటెండ్‌, సందేశాలు పంపడం వంటి పనులను వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా చేయొచ్చు.

* ఎంజీ ఐ-స్మార్ట్‌ సాంకేతికత ద్వారా మరో 80కి పైగా ఇంటర్నెట్‌ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. మ్యాప్‌మైఇండియా, జియో కనెక్టివిటీ వంటి సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని కూడా పొందొచ్చు.

* అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రోడ్డుపై ఒకే వరుసలో వెళ్లేలా లేక్‌ కీప్ అసిస్ట్‌, లేన్‌ ఛేంజ్‌ అసిస్ట్‌, ఫ్రంట్‌ కొలిజన్‌ అలర్ట్‌, రేర్‌ క్రాస్‌ ట్రాఫిక్‌ అలర్ట్‌, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

* ఈ పండగ సీజన్‌లోనే దీన్ని మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ధర అధికారికంగా ప్రకటించలేదు. రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని