1.5లక్షల సీజనల్‌ ఉద్యోగాలు: ఫ్లిప్‌కార్ట్‌ - 1.5 lakh seasonal jobs: Flipkart
close

Published : 16/09/2021 03:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

1.5లక్షల సీజనల్‌ ఉద్యోగాలు: ఫ్లిప్‌కార్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌: పండగల గిరాకీని దృష్టిలో పెట్టుకుని దేశ వ్యాప్తంగా కొత్తగా 66 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. దీంతోపాటు కొత్తగా 1.5లక్షల సీజనల్‌ ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంది. కిరాణా దుకాణాలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో పాటు, 1,000 కిపైగా డెలివరీ హబ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించింది. తెలంగాణతోపాటు, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో గత నాలుగైదు నెలలుగా ఈ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌లో రుణ పరిమితిని రూ.70వేలకు పెంచినట్లు ఫిన్‌టెక్‌ పేమెంట్స్‌ గ్రూపు హెడ్‌ రంజిత్‌ బోయనపల్లి తెలిపారు. 3, 6, 9, 12 నెలల సులభ వాయిదాలు ఎంచుకునే వీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.


వాహన్‌కు రూ.60 కోట్ల పెట్టుబడి

ఈనాడు, హైదరాబాద్‌: కార్మికులకు (బ్లూ కాలర్‌) ఉద్యోగ అవకాశాలను కల్పించే అంకుర సంస్థ వాహన్‌కు రూ.60 కోట్ల (8మిలియన్‌ డాలర్లు) పెట్టుబడి సమకూరింది. ఇప్పటికే ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన ఖోస్లా వెంచర్స్‌ ఆధ్వర్యంలో ఈ  మొత్తం సమకూరినట్లు సంస్థ వెల్లడించింది. ఈ సిరీస్‌ ఏ ఫండింగ్‌లో ఎయిర్‌టెల్‌, పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ, వెరిజాన్‌ మీడియా గ్రూప్‌ సీఈఓ గురు గౌరప్పన్‌లాంటి వారూ ఉన్నారు. సమీకరించిన నిధులతో విస్తరణ ప్రణాళికలు చేపట్టనున్నట్లు సంస్థ సీఈఓ మాధవ్‌ కృష్ణ తెలిపారు. నెలకు దాదాపు 7,000 పైగా నియామకాలు ఈ సంస్థ ద్వారా జరుగుతున్నాయి. ఏడాదిలో దేశంలో అతి పెద్ద బ్లూ కాలర్‌ నియామకాల సంస్థగా మారుతామని ఆయన పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని