మీ ఏటీఎం కార్డుకి బీమా లభిస్తుందా? - ATM-cardholder-can-entitled-to-an-insurance-cover
close

Published : 26/12/2020 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ ఏటీఎం కార్డుకి బీమా లభిస్తుందా?

ఏటీఎం కార్డులు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత బ్యాంకుల్లో వ‌రుస‌లో వేచిచూడ‌కుండా లావాదేవీలు సుల‌భ‌త‌రం అయ్యాయి. అయితే ఏటీఎం కార్డు కేవ‌లం డ‌బ్బు విత్‌డ్రా చేసేందుకే కాకుండా అంత‌కుమించి చాలా సౌక‌ర్యాల‌ను అందిస్తోంది. అదేవిధంగా ఏటీఎం కార్డుతో బీమా క‌వ‌ర్‌ను అందిస్తుంద‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు.

బీమా క‌వ‌ర్‌:

ఏటీఎం కార్డుతో వినియోగ‌దారులు బీమా పాల‌సీని పొంద‌వ‌చ్చన్న విష‌యం తెలుసా. దేశంలో చాలా వ‌ర‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు బ్యాంకులు ఏటీఎం కార్డుతో ప్ర‌మాద బీమా క‌వ‌ర్‌ను అందిస్తున్నాయి. ఈ బీమా పాల‌సీని పొందేందుకు బ్యాంకు ఖాతా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుండాలి.

హామీ మొత్తం:

బ్యాంకులు అందించే బీమా క‌వ‌ర్ కార్డు ర‌కం, ప్ర‌మాద తీవ్ర‌త‌పై ఆధార‌ప‌డి రూ.50 వేల నుంచి రూ.10 లక్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ఒక్కో బ్యాంకుకి ఒక్కో ర‌క‌మైన నియ‌మ నిబంధ‌న‌లు ఉంటాయి. కొన్ని ఏటీఎం కార్డుల‌కు ఆటోమేటిక్‌గా ఈ స‌దుపాయం ఉంటే మ‌రి కొన్ని ఏటీఎం కార్డుల‌కు ఈ ఆప్ష‌న్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికోసం కార్డు గ‌త మూడు నెల‌ల నుంచి యాక్టివ్‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంటుంది. మీ ఖాతా చాలా రోజుల వ‌ర‌కు యాక్టివ్‌గా లేక‌పోతే బ్యాంకులు ఈ స‌దుపాయాన్ని నిలిపివేస్తాయి. చాలామందికి త‌మ ఏటీఎం కార్డుతో పాటు బీమా క‌వ‌ర్ స‌దుపాయం ఉంటుంద‌న్న విష‌యం తెలియ‌దు. మీకు ఏటీఎం కార్డు ఉంటే బీమా క‌వ‌ర్ ఉందో లేదా అన్న విష‌యం బ్యాంకును అడిగి తెలుసుకోవాలి.

బీమా క‌వ‌ర్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి:

కార్డు వినియోగ‌దారుడికి ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. దీనికోసం మొద‌ట ప్ర‌మాదం గురించి వెంట‌నే పోలీసుల‌కు తెలియ‌జేయాలి. గాయ‌ప‌డిన వ్య‌క్తికి సంబంధించి అన్ని సంబంధిత డాక్యుమెంట్లు, మెడిక‌ల్ రికార్డులు ద‌గ్గర ఉంచుకోవాలి. ఒక‌వేళ ప్ర‌మాదం వ‌ల‌న మ‌ర‌ణిస్తే పోస్టుమార్టం రిపోర్టు, పోలిస్ రిపోర్టు, మ‌ర‌ణ దృవీక‌ర‌ణ ప‌త్రం, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి అవ‌స‌రం అవుతాయి. దీంతో పాటు గ‌త 60-90 రోజులుగా చేసిన లావాదేవీల వివ‌రాలు చూప‌వ‌ల‌సి ఉంటుంది. ఈ నిబంధ‌న‌లు బ్యాంకుల‌కు మ‌ధ్య వేర్వేరుగా ఉంటాయి.

చివ‌ర‌గా:

చాలామంది బీమా పాల‌సీల‌కు డ‌బ్బు చెల్లించేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అయితే ఏటీఎం కార్డుతో వ‌చ్చే ఈ క‌వ‌ర్ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఏటీఎంతో లావాదేవీల‌తో పాటు అవ‌స‌ర‌మైన‌ప్పుడు బీమా హామీ కూడా పొంద‌వ‌చ్చు. ఏటీఎం కార్డును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్, క్యాష్ బ్యాక్ వంటి ఆఫ‌ర్ల కోస‌మే కాకుండా ఇలా మ‌రింత ప‌నికొచ్చే విధంగా ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల డెబిట్ కార్డులపై కాంప్లిమెంట‌రీ బీమా క‌వ‌ర్…

atm1.jpg


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని