భారత్‌లో యాపిల్‌ స్టోర్లు: టిమ్‌కుక్‌ - Apple Stores in India Timcook
close

Published : 29/01/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో యాపిల్‌ స్టోర్లు: టిమ్‌కుక్‌

న్యూయార్క్‌/దిల్లీ: 2020 డిసెంబరు త్రైమాసికంలో యాపిల్‌ భారత వ్యాపారం రెట్టింపైంది. సెప్టెంబరులో ప్రారంభించిన ఆన్‌లైన్‌ స్టోర్‌ మెరుగ్గా రాణించడం కలిసొచ్చింది. భారత్‌లో వ్యాపార వృద్ధికి ఇంకా భారీ అవకాశాలున్నాయని, ఇందుకు అనుగుణంగా రిటైల్‌ స్టోర్లు నెలకొల్పే యోచనలో ఉన్నట్లు యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వెల్లడించారు. 2020  డిసెంబరు 26తో ముగిసిన మొదటి త్రైమాసికంలో అంతర్జాతీయంగా రికార్డు స్థాయిలో 11140 కోట్ల డాలర్ల (రూ.8.3 లక్షల కోట్లు) ఆదాయాన్ని యాపిల్‌ నమోదు చేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ.  డిసెంబరు త్రైమాసికానికి ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న యాపిల్‌ పరికరాల సంఖ్య 165 కోట్లు మించింది.  ఐఫోన్‌ల అమ్మకాలు 17 శాతం, ఐప్యాడ్‌ 41 శాతం, మ్యాక్‌ 21 శాతం చొప్పున వృద్ధి సాధించాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని