బంగారానికి పెరిగిన గిరాకీ - Demand for gold increased
close

Updated : 30/04/2021 08:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బంగారానికి పెరిగిన గిరాకీ

ముంబయి: దేశీయంగా పసిడికి గిరాకీ మళ్లీ పెరిగింది. 2020 జనవరి-మార్చి నాటి 102 టన్నులతో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో గిరాకీ 37 శాతం వృద్ధితో 140 టన్నులకు చేరింది. కరోనా షరతులు సడలించడం, 10 గ్రాముల పసిడి ధర జీవనకాల గరిష్ఠాల నుంచి రూ.47,000 దరిదాపుల్లోకి దిగిరావడం ఇందుకు కారణమని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) పేర్కొంది.  విలువ పరంగా చెప్పాలంటే ఏడాది వ్యవధిలో పసిడి డిమాండ్‌ రూ.37,580 కోట్ల నుంచి 57% పెరిగి రూ.58,800 కోట్లకు చేరుకుంది.
* ఆభరణాల గిరాకీ 39% వృద్ధి చెంది 102.5 టన్నులకు చేరింది. విలువపరంగా ఇది 58% పెరిగి రూ.43,100 కోట్లుగా నమోదైంది.
* పెట్టుబడుల గిరాకీ 28.1 టన్నుల నుంచి 34% హెచ్చి 37.5 టన్నులకు చేరింది. విలువ పరంగా చూస్తే రూ.10,350 కోట్ల నుంచి 53% వృద్ధితో రూ.15,780 కోట్లకు పెరిగింది.
* పసిడి పునర్వినియోగం మాత్రం 18.5 టన్నుల నుంచి 20% తగ్గి 14.8 టన్నులకు చేరుకుంది. నికర బులియన్‌ దిగుమతులు 83.1 టన్నుల నుంచి 262% దూసుకెళ్లి 301 టన్నులకు చేరింది. గతేడాది జనవరి-మార్చితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అంతర్జాతీయ పసిడి గిరాకీ 23% తగ్గి 815.7 టన్నులకు చేరింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని