ఈఎల్ఎస్ఎస్ లేదా ఎన్‌పీఎస్‌లో ప‌న్ను ఆదాకు ఏది మంచిది  - ELSS-or-NPS-for-Tax-saving
close

Updated : 05/02/2021 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈఎల్ఎస్ఎస్ లేదా ఎన్‌పీఎస్‌లో ప‌న్ను ఆదాకు ఏది మంచిది 

ఈఎల్ఎస్, ఎన్‌పీఎస్‌ పూర్తిగా రెండు వేర్వేరు ప్రయోజనాలతో  కూడిన ప‌థ‌కాలు. ఈ రెండింటికీ ఆదాయ ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. మ‌రి ఎందులో పెట్టుబ‌డులు పెట్టాలో ఎలా నిర్ణ‌యించుకుంటారు.

మీ పెట్టుబడి లక్ష్యం గురించి స్పష్టంగా తెలుసుకోవడం అవ‌స‌రం. అంటే మీ పెట్టుబ‌డులు స్వ‌ల్ప‌కాలికం కోస‌మా లేదా దీర్ఘ‌కాలిక‌మా, ప‌న్ను ఆదా కోసమా లేదా లిక్విడిటీ కోస‌మా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త ఉండాలి.
 ఉదాహరణకు, మీరు పన్నులను ఆదా చేసి, లిక్విడిటీ కలిగి ఉండాలని ఆలోచిస్తున్నట్లయితే, ఎఈఎల్ఎస్ఎస్ తీసుకోవ‌చ్చు. ఎందుకంటే ఇందులో  3 సంవత్సరాల లాక్‌-ఇన్ పీరియ‌డ్ త‌ర్వాత ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఎన్‌పిఎస్‌లో డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఉప‌సంహ‌రించుకునే వీలుండ‌దు. 60 ఏళ్ళ వయసులో, 60 శాతం కార్పస్‌ను పన్ను రహితంగా ఉపసంహరించుకోవచ్చు, కాని 40 శాతం తప్పనిసరిగా పన్ను చెల్లించదగిన యాన్యుటీగా తీసుకోవాలి.
ఈఎల్ఎస్ఎస్  దీర్ఘకాలిక సంపద సృష్టికి కూడా బాగా ఉప‌య‌గ‌ప‌డుతుంది. అవి స్వచ్ఛమైన ఈక్విటీ ఫండ్లు, దీర్ఘకాలంలో దాదాపు 95-100 శాతం వరకు ఈక్విటీలలో పెట్టుబడి పెట్టబడతాయి.

మరోవైపు, ఎన్‌పిఎస్ పెట్టుబడిదారులు తమ ఎన్‌పిఎస్ పోర్ట్‌ఫోలియో కేటాయింపులో 75 శాతం కంటే ఎక్కువ ఈక్విటీని కలిగి ఉండలేరు, మిగిలినవి డెట్ ఫండ్ల‌లో ఉంటాయి. అలాగే, అటువంటి స్థాయి ఈక్విటీ కేటాయింపు 35 ఏళ్లలోపు వారికి మాత్రమే లభిస్తుంది. వారు ఎన్‌పిఎస్ యాక్టివ్ ఎంపికను ఎంచుకుంటే సంవత్సరాలు గడిచేకొద్దీ, ఈ పరిమితి  క్రమంగా తగ్గుతుంది. కాబట్టి సాంకేతికంగా చెప్పాలంటే ఎన్‌పిఎస్ ఎప్పటికీ ఈఎల్ఎస్ఎస్‌ ఫండ్ల ఈక్విటీ కేటాయింపుతో సరిపోలదు. ఈఎల్ఎస్ఎస్‌లో ఈక్విటీ కేటాయింపు ఎక్కువ కాడంతో ఎన్‌పీఎస్ కంటే మంచి రాబడిని ఇస్తుందని చెప్పవచ్చు.

అయితే  ఆర్థిక నిపుణులు ఎన్‌పిఎస్‌ను రిటైర్మెంట్ సాధనంగా  సిఫార్సు చేస్తున్నారు.లిక్విడిటీ స‌మ‌స్య‌ లేకపోతే ఎన్‌పిఎస్ ఒక అద్భుతమైన పదవీ విరమణ సాధనం. ఎన్‌పిఎస్ కూడా సెక్ష‌న్ 80 CCD (1B) రూ. 50,000  మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఇది 80 సి కింద మినహాయింపు కంటే ఎక్కువ. ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డుల కేటాయింపులు  వయస్సు, జీవిత దశను బట్టి వ్యక్తికి వ్యక్తికి బిన్నంగా ఉంటుంది.

మంచి పన్ను ఆదా ఎంపిక ఏది?
పన్ను ఆదా చేయడానికి ఉత్తమమైన ఎంపిక ఏమిటో నిర్ణయించేటప్పుడు, పెట్టుబడిదారుడు రిస్క్ ప్రొఫైల్, ఆర్థిక లక్ష్యాలు, ఆస్తి కేటాయింపు వంటి అంశాల‌ను పరిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.
ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే  ఎన్‌పిఎస్, ఈఎల్‌ఎస్‌ఎస్‌లను పరిశీలించాలి.  తక్కువ-ఆదాయ / పన్ను పరిధిలో ఉంటే, త‌క్కువ కాలంలో లిక్విడిటీ అవసరమైతే ఈఎల్ఎస్ఎస్ ఎంచుకోవాలి. ని సిఫార్సు చేస్తున్నాము. దీర్ఘకాలికంగా ద్రవ్యత అవసరం లేకపోతే ఎన్‌పిఎస్‌ను సిఫార‌సు చేస్తున్నారు ఆర్థిక నిపుణులు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని