పెన్ను, పేపర్ లేకుండా జనాభా లెక్కింపు - FM Confirms this time Census Will be First Digital Census in India
close

Published : 01/02/2021 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెన్ను, పేపర్ లేకుండా జనాభా లెక్కింపు

వెల్లడించిన సీతారామన్

దిల్లీ: 2021లో జనాభా లెక్కలు  పూర్తిగా డిజిటల్‌గా నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దాంతో చరిత్రలోనే తొలిసారిగా కాగిత రహితంగా జనగణన జరగనుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్‌ చేసే దిశగా..ఈ ప్రయాణం దోహదం చేస్తుందని బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె వివరించారు.

2021లో నిర్వహించే జనాభా లెక్కలను పూర్తిగా డిజిటల్‌ విధానంలో నమోదు చేయనున్నట్లు 2019లోనే కేంద్ర మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. దానికి సంబంధించిన వ్యవస్థను నిర్మించేందుకు రూ.12 వేల కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపారు. అలాగే మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని అప్పట్లో ఆయన వివరించారు. అయితే దానికి సంబంధించిన విధివిధానాలను మాత్రం ప్రకటించలేదు. అయితే ఈ విధానంలో సమాచార భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలు కీలకంగా మారనున్నాయని నిపుణులు అంటున్నారు. కాగా, మార్చి 2021లో ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ఆదాయపన్ను చెల్లింపుదారులకు దక్కని ఊరట


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని