జేబుకు చిల్లే: పెరగనున్న నిత్యావసరాల ధరలు! - FMCG cos look to hike prices to offset inflationary pressure on raw material inputs
close

Updated : 10/01/2021 20:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జేబుకు చిల్లే: పెరగనున్న నిత్యావసరాల ధరలు!

దిల్లీ: సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. నిత్యావసరాల కొనుగోలు ఇకపై భారం కానుంది. ఇంట్లో నిత్యం ఉపయోగించే సబ్బులు, నూనెలు, బిస్కెట్లు, టూత్‌ పేస్టులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముడిసరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచేందుకు ఆయా కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

పారాచ్యూట్‌, సఫోలా ఆయిల్స్‌ను ఉత్పత్తి చేసే మారికో సహా పలు కంపెనీలు ఇప్పటికే ధరలను పెంచగా.. డాబర్‌, పార్లే, పతంజలి వంటి సంస్థలు ధరలు పెంచేందుకు పరిస్థితిని గమనిస్తున్నాయి. వంట నూనె, కొబ్బరి నూనె, పామాయిల్‌ వంటి ముడి సరకుల ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. ఈ క్రమంలో మరింత కాలం వస్తువుల ధరలు పెంచకుండా ఉంటే తమ స్థూల ఆదాయాలపై ప్రభావం పడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి.

గత మూడు నాలుగు నెలలుగా ముడి సరకులు, ముఖ్యంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయని పార్లే ప్రొడక్ట్స్‌ సీనియర్‌ కేటగిరీ హెడ్‌ మయాంక్‌ షా అన్నారు. దీనివల్ల తమ మార్జిన్లపై ప్రభావం పడుతోందన్నారు. ఇప్పటికిప్పుడు ధరలు పెంచకపోయినప్పటికీ మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. దాదాపు 4 నుంచి 5 శాతం వరకు పెంపుదల ఉండే అవకాశం ఉందని వివరించారు. ముడిసరకుల ధరల పెరుగుదల నేపథ్యంలో డాబర్‌ ఇండియా సీఎఫ్‌వో లలిత్‌ మాలిక్‌ సైతం ధరల పెంపు ఉంటుందని సంకేతమిచ్చారు. మార్కెట్‌లో ఉన్న పోటీ ఆధారంగా పెంపు ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌కే తిజర్‌వాలా పేర్కొన్నారు. మార్కెట్‌ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

ఇవీ చదవండి..
9 నెలల్లో 13 శాతం పెరిగిన నగదు చలామణీ
యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి పార్లర్‌ తొలగింపు..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని