తగ్గిన బంగారం ధర    - Gold declines Rs 317 on muted global trends
close

Updated : 06/05/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తగ్గిన బంగారం ధర  

దిల్లీ: బంగారం ధర కాస్త దిగొచ్చింది. రూ.317లు తగ్గడంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,382గా ఉంది. అంతర్జాతీయంగా పసిడి  లోహం ధరల్లో క్షీణతే ఇందుకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. నిన్న 10గ్రాముల పసిడి ధర రూ.46,699గా ట్రేడైన విషయం తెలిసిందే. మరోవైపు, వెండి ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండి ధర 2,328లు పెరగడంతో 70,270కి చేరింది.  అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1776 యూఎస్‌ డాలర్లుగా ట్రేడ్‌ అవుతుండగా.. ఔన్సు వెండి ధరలు 26.42డాలర్లుగా ఉంది. ఇకపోతే, హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 48,350 (పన్నులతో కలిపి)గా ఉండగా.. వెండి కిలో రూ.73,890గా ట్రేడ్‌ అవుతోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని