Gold rate: పరుగులు పెడుతున్న పసిడి ధర - Gold gains Rs 333 silver rallies Rs 2021
close

Updated : 18/05/2021 17:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gold rate: పరుగులు పెడుతున్న పసిడి ధర

న్యూదిల్లీ: పసిడి ధర మళ్లీ పెరిగింది. సోమవారం పదిగ్రాములపై రూ.348 పెరిగిన బంగారం ధర మంగళవారం మరోసారి రూ.300లకు పైగా పెరగడం గమనార్హం. దేశరాజధాని దిల్లీలో పసిడి రూ.333 పెరగడంతో 10గ్రాములు రూ.47,833కు చేరింది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ ఏర్పడటంతో ధర పెరిగిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి.

ఇక వెండి అయితే భారీగా పెరిగింది రూ.2,021 పెరగడంతో కిలో రూ.73,122కు చేరింది. నిన్న కిలో రూ.71,101గా ఉండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,869 డాలర్లు కాగా, వెండి ఔన్సు 28.48డాలర్లుగా నమోదైంది. డాలర్‌ బలహీనపడిన కారణంగానే పసిడి ధరలు పెరుగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ విశ్లేషకుడు తపన్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.50వేలకు పైగా ట్రేడ్‌ అవుతోంది. సోమవారం పది గ్రాములు రూ.49,260 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని