స‌రైన ప్ర‌ణాళికతో ఉద్యోగం పోయినా భ‌రోసా!  - How-to-survive-while-job-loss
close

Updated : 09/07/2021 13:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స‌రైన ప్ర‌ణాళికతో ఉద్యోగం పోయినా భ‌రోసా! 

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ఎదురైన న‌ష్టాల‌తో చాలా కంపెనీలు ఉద్యుగుల‌ను తొల‌గిస్తున్న వార్త‌ల‌ను చూస్తున్నాం. అనుకోకుండా ఉద్యోగం కోల్పోతే వారిపై ఆధార‌ప‌డిన కుటుంబ స‌భ్యుల ప‌రిస్థితి ఏంటి. తిరిగి కొత్త ఉద్యోగం చూసుకునేంత వ‌ర‌కు ఇంట్లో ఖ‌ర్చుల‌ను ఎలా భ‌రించాలి అంటే అన్నింటికీ ముందుగానే సిద్ధ‌మై ఉంటే ఎలంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా చింతించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీనికోసం ఎలాంటి ప్ర‌ణాళిక వేసుకోవాలి ఎలా సిద్ధంగా ఉండాలి తెలుసుకోండి. 
    
 1. అత్య‌వ‌స‌ర నిధి:
 మీ కుటుంబానికి నెల‌కు ఎంత బ‌డ్జెట్ అవస‌ర‌మ‌వుతుందో అంత‌కు 12 రెట్ల డ‌బ్బును ఎమ‌ర్జెన్సీ ఫండ్‌గా పెట్టుకోవాలి. 
 ఉదాహ‌ర‌ణ‌కు మీ నెల‌వారి బ‌డ్జెట్ రూ.65 వేలు అనుకుంటే,  రూ.65 వేలు* 12= రూ.7,80,000 ఎమ‌ర్జెన్సీ ఫండ్‌గా పెట్టుకోవాలి. మీకు కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ఈ స‌మ‌యం స‌రిపోతుంది. క్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణం వంటి భ‌ద్ర‌త లేని రుణాలు ఉంటే వీలైనంత త్వ‌ర‌గా చెల్లించాలి. ఎందుకంటే వాటి వ‌డ్డీ రేట్లు అధికంగా 36 నుంచి 42 శాతం వ‌ర‌కు ఉంటాయి. మొత్తం ఒకేసారి చెల్లించ‌క‌పోయినా వీలైనంత‌గా త‌గ్గించుకుంటూ ఉండాలి. 
 2. నిరుప‌యోగ వ‌స్తువువుల‌ను వినియోగంలోకి తీసుకురండి:
 కొన్ని వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి ఏమి ఉప‌యోగం లేక‌పోయినా అలా ఉంచేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు పాత కారు , మీరు త‌క్కువ‌గా ఉప‌యోగించిన వ‌స్తువులు, పాత డిజైన్‌తో ఉన్న జువెల‌రీ వంటివాటిని అమ్మేసి నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యోగం పోయిన‌ప్పుడు అనుభ‌వం, నైపుణ్యం క‌లిగిన వారికి సుల‌భంగానే మ‌రో ఉద్యోగం ల‌భిస్తుంది. అప్ప‌టివ‌ర‌కు ఇలా ఉప‌యోగం లేని వ‌స్తువుల‌ను వినియోగంలోకి తెచ్చుకోవాలి.
 3. ప‌రిస్థితులుకు త‌గిన‌ట్లుగా న‌డుచుకోవాలి :
  చాలా ద‌ర్జాగా బ‌తికిన‌వారు కూడా ఉద్యోగం పోయిన‌ప్పుడు ప‌రిస్థితుల‌కు అనుగుణంగా స‌ర్దుకుపోవాల్సి ఉంటుంది.  ఇంత‌కుముందులా అన్ని విలాస‌వంత‌మైన వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌క‌పోవ‌డం మంచిది.  రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌లో తిన‌డం త‌గ్గించుకొని ఖ‌ర్చును అదుపులో పెట్టాలి. అన‌వ‌స‌ర‌మైన వ‌స్తువుల‌ను కొనుగోలు చేయడం, ప్ర‌యాణాలు చేయ‌డం, వృథా ఖ‌ర్చులు చేయ‌డం ఆపేయాలి. ఇవ‌న్నీ క‌ష్టంగానే ఉన్న‌ప్ప‌టికీ కొన్నిసార్లు త‌ప్ప‌వు. 
4. బీమా పాల‌సీ:
 చాలా మంది వారు పొదుపు చేసుకున్న డ‌బ్బు బీమా పాల‌సీ లేదా  పెట్టుబ‌డుల‌కు ఉప‌యోగిస్తారు. ఉద్యోగం కోల్పోయిన‌ప్పుడు ఆ పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌డం కుద‌ర‌దు. మ‌రి అలాంటి స‌మ‌యాల్లో బీమా ప్రీమియం చెల్లించేందుకు క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించ‌కూడ‌దు. ఆల‌స్య రుసుముతో అయినా త‌ర్వాత చెల్లించాలి. పాల‌సీనీ పున‌రిద్ధ‌రించుకోవాలి. జాబ్ లాస్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ వంటివి కొనుగోలు చేయ‌కూడ‌దు.  ఉద్యోగానికి రాజీనామా చేస్తే  వాటితో ఎలాంటి ఉప‌యోగం ఉండ‌దు. కేవ‌లం జీవిత లేదా ఆరోగ్య బీమా పాల‌సీల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. జ‌ర‌గాల్సిన సంఘ‌ట‌న‌లు ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు. ఎటువంటి ప‌రిస్థితినైనా ఎద‌ర్కునేందుకు సిద్ధంగా ఉండాలి. అలాంట‌ప్పుడు ఆరోగ్య‌, జీవిత బీమా పాల‌సీలే అండ‌గా నిలుస్తాయి. ఉద్యోగం కోల్పోయిన‌ప్పుడు సంస్థ‌లో తీసుకున్న బీమా పాల‌సీలు ప‌నిచేయ‌వు. అందుకే ప్ర‌త్యేకంగా మీరు పాల‌సీలు తీసుకోవాలి. మీకు ఏదైనా జ‌రిగిన‌ప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక భ‌రోసా ఉంటుంది.  కుటుంబ స‌భ్యుల‌కు ఆరోగ్యం బాగా లేన‌ప్పుడు ఆరోగ్య బీమా పాల‌సీ ఉప‌యోగ‌ప‌డుతుంది. 
5. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌ను చివ‌రి వ‌ర‌కు కొన‌సాగించండి:
 దీర్ఘ‌కాలిక డ‌బ్బు లేదా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు, ప్రావిడెంట్ ఫండ్ వంటివి ప‌న్ను మిన‌హాయింపు ఉండే పెట్టుడులు ఎక్కువ‌కాలం కొన‌సాగించండి. అత్య‌వ‌స‌ర నిధి ఉంటే ఈ పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీనిని పిల్ల‌ల ఉన్న‌త విద్య‌, పెళ్లి, ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఉప‌యోగించాలి. 
  6. మొత్తం డ‌బ్బును వ్యాపారంలో పెట్టొద్దు:
 మీ వ‌ద్ద ఉన్న మొత్తం డ‌బ్బును వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఉప‌యోగించ‌కూడ‌దు. అయితే వ్యాపారాన్ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌డం అనేది ఒక క‌ళ . వ్యాపారంలో లాభ‌, న‌ష్టాలు రెండూ ఉంటాయి. లాభ‌, న‌ష్టాల‌ను అంచ‌నా వేసుకొని పెట్టుబ‌డుల‌కు ప్ర‌త్యేకంగా పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యోగం చేసే నైపుణ్యం ఉంటే ఆ మార్గాన్ని ఎంచుకోవాలి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని