close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120073066 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1269352649914109952 [video_short_link] => 1269352649914109952 [created_by] => [created_date] => [modified_by] => 9821947 [modified_date] => 2020-06-07 11:24:44.548661 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 07/06/2020 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జియో యూజర్లకు మరో ఆఫర్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అద్భుతమైన ఆఫర్లలో వినియోగదార్లను ఆకట్టుకునే జియో తాజాగా మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది. తమ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఏడాదిపాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, రూ.401 నెలవారీ రిఛార్జీ ప్లాన్‌, రూ.2,599 వార్షిక ప్లాన్‌, రూ.612, రూ.1208 డేటా వౌచర్లు.. వీటిలో ఏదో ఒక ప్లాన్‌ను ఎంచుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఉంచిన కంపెనీ.. వినియోగదారుల నుంచి భారీ స్పందన రావడంతో శనివారం రాత్రి వివరాలతో పాటు ప్లాన్‌ను లాంఛ్‌ చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఉంచింది. 

ఈ తరహా ఆఫర్‌ ఇప్పటికే ఎయిర్‌టెల్‌ అందిస్తోంది. రూ.401తో రిఛార్జి చేసుకునే వారికి ఏడాదిపాటు డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా ఇస్తోంది. ఎయిర్‌టెల్‌కు పోటీగా ఇప్పుడు జియో కూడా ఈ ఆఫర్‌ను అందించేందుకు ముందుకు వచ్చింది.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.