లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - Markets are in Green
close

Published : 24/02/2021 09:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 131 పాయింట్లు ఎగబాకి 49,751 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 14,751 వద్ద ఆరంభమైంది. ఉదయం 9:36 గంటల సమయానికి సెన్సెక్స్‌ 210 పాయింట్ల లాభంతో 49,978 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 66 పాయింట్లు ఎగబాకి 14,768 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.43 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. దీంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. కీలక కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తుండడం సూచీలను ముందుకు తీసుకెళ్తోంది.

ఐటీ, టెక్‌, విద్యుత్తు రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. లోహ, ఇంధన, పీఎస్‌యూ, స్థిరాస్తి, ఆటో రంగాల షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. కోల్‌ ఇండియా, ఐవోసీఎల్‌, బజాజ్‌ ఫినాన్స్‌ లిమిటెడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటోకార్ప్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. యూపీఎల్‌, టాటా కన్సల్టెన్సీ, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని