లాభాల్లో స్టాక్ మార్కెట్లు - Markets are in Green
close

Updated : 12/03/2021 11:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 51,660 వద్ద, నిఫ్టీ 15,321 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:35 గంటల సమయానికి సెన్సెక్స్‌ 440 పాయింట్లు ఎగబాకి 51,724 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 15,174 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.71 వద్ద ప్రారంభమైంది. 

గురువారం అమెరికా సూచీలు లాభాల్లో ముగిశాయి. బాండ్ల రాబడులు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణ భయాలు తొలగిపోవడం అక్కడి మదుపర్ల సెంటిమెంటును పెంచింది. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో పయనిస్తున్నాయి. కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతుండడం, అమెరికా భారీ ఉద్దీపన ప్యాకేజీకి కాంగ్రెస్‌ ఆమోదం లభించడం, అగ్రరాజ్యం నిరుద్యోగుల సంఖ్య నవంబరు నాటి కనిష్ఠానికి పడిపోవడం వంటి సానుకూల పరిణామాలు నేడు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి.

దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫినాన్స్‌ లిమిటెడ్‌, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని