లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు - Markets are in green
close

Published : 30/03/2021 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 49,331 వద్ద, నిఫ్టీ 14,628 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:32 గంటల సమయానికి సెన్సెక్స్‌ 532 పాయింట్లు లాభపడి 49,533 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 162 పాయింట్లు ఎగబాకి 14,670 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.78 వద్ద కొనసాగుతోంది.

అమెరికా మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ ఫ్లాట్‌గా కదలాడింది. వీటితో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు రాణిస్తుండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది.

దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. మహీంద్రా అండ్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటాకార్ప్‌, మారుతీ సుజుకీ ఇండియా షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని