ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు - Markets are moving in volatality
close

Updated : 22/02/2021 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఊగిసలాటలో పయనిస్తున్నాయి. సోమవారం 50,936 వద్ద సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ సైతం 14,999 వద్ద స్వల్ప లాభంతో ఆరంభమైంది. కొద్ది సేపట్లోనే రెండు దేశీయ సూచీలు భారీగా కుంగాయి. సెన్సెక్స్‌ 50,701 వద్ద, నిఫ్టీ 14,928 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. మళ్లీ కాసేపటికే కోలుకొని లాభాల్లోకి వెళ్లినప్పటికీ.. తిరిగి నేలచూపులు చూస్తున్నాయి. ఇక ఉదయం 9:38 గంటల సమయానికి సెన్సెక్స్‌ 27 పాయింట్లు నష్టపోయి 50,860 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ ఆరు పాయింట్లు కోల్పోయి 14,975 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.60 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు నేడు లాభాల్లో పయనిస్తున్నాయి. అయినప్పటికీ.. దేశీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో ఇటీవలి లాభాల స్వీకరణ పరంపరను మదుపర్లు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు స్థిరీకరణ దిశగా కొనసాగుతున్నాయి. ఆటో, ఇన్‌ఫ్రా, పీఎస్‌యూ రంగ షేర్లు నష్టాల్లో పయనిస్తుండడం సూచీలపై ప్రభావం చూపుతోంది.

లోహ, టెలికాం, టెక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాకింగ్‌, ఐటీ రంగాల షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నప్పటికీ.. కీలక కంపెనీల షేర్లు నేలచూపులు చూడడం సూచీలను కట్టడి చేస్తున్నాయి.  హిందాల్కో ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెసిఫికేషన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐటీసీ లిమిటెడ్‌, ఎల్‌ అండ్‌ టీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని