క్రిప్టోకరెన్సీలలో లావాదేవీలను అనుమ‌తించిన మాస్టర్ కార్డ్ - Mastercard-to-allow- cryptocurrency-transactions
close

Published : 11/02/2021 12:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రిప్టోకరెన్సీలలో లావాదేవీలను అనుమ‌తించిన మాస్టర్ కార్డ్

ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మాస్టర్ కార్డ్, తాజాగా తన నెట్‌వర్క్‌లోని కొన్ని క్రిప్టోకరెన్సీల్లో లావాదేవీలు జరపడానికి కార్డ్‌హోల్డర్లను అనుమతించడం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది

భ‌విష్య‌త్తులో క్రిప్టో, చెల్లింపుల‌ కోసం మేము ప్రస్తుతం సన్నద్ధమవుతున్నాము, ఈ సంవత్సరం మాస్టర్ కార్డ్ మా నెట్‌వర్క్‌లో నేరుగా ఎంచుకున్న క్రిప్టోకరెన్సీలకు అనుమ‌తించ‌డం ప్రారంభిస్తుందని ప్రకటించింది. కొత్త డిజిటల్ కరెన్సీలను ప్రారంభించాలనే ప్ర‌ణాళిక‌తో సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులతో చురుకుగా పాల్గొంటుంది.

కంపెనీ తన సొంత‌ ప్రణాళికలలో వినియోగదారుల రక్షణ, సమ్మతికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంది. మాస్టర్ కార్డ్ ఇప్పటికే వైరెక్స్ , బిట్‌పేతో సహా కొన్ని అతిపెద్ద క్రిప్టోకరెన్సీ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది.

 డిజిటల్ ఆస్తులకు నేరుగా మద్దతు ఇవ్వడానికి మా నిర్ణ‌యం క్రిప్టోను అంగీకరించడానికి అనుమతిస్తుంది - ఇది ప్రతి డిజిటల్ ఆస్తికి ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతుల ద్వారా ప్రస్తుతం పరిమితంగా అనుమ‌తించిన‌ట్లు తెలిపింది. ఈ మార్పు అసమర్థతలను కూడా తగ్గిస్తుంది, వినియోగదారులు, వ్యాపారులు క్రిప్టో, సాంప్రదాయాల మధ్య కొనుగోళ్లు చేయడానికి సంకోచించ‌కుండా ఉండటానికి వీలు కల్పిస్తుంది.

టెస్లా కంపెనీ ఈ వారం బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిందని, క్రిప్టోకరెన్సీని రికార్డు స్థాయికి చేర‌డానికి ఇదొక కార‌ణ‌మాని మాస్టర్ కార్డ్ ప్రకటించింది.

  మీరు క్రిప్టోకరెన్సీలను ఉపయోగించడం ప్రారంభించమని మేము  సిఫారసు  చేయ‌ట్లేదు. అయితే వినియోగ‌దారులు, వ్యాపారులు, డిజిటల్ విలువను అందించ‌డానికి కృషి చేస్తామ‌ని మాస్ట‌ర్‌కార్డ్‌ తెలిపింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని