close

తాజా వార్తలు

ఇకపై రెండు రోజుల్లోనే నంబర్‌ పోర్టబిలిటీ

కొత్త నిబంధనలు ప్రకటించిన ట్రాయ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెలికమ్‌ రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ)కి సంబంధించి కొత్త నిబంధనలు ప్రకటించింది. పలు సాంకేతిక కారణాల వల్ల  కొంత కాలంగా ఆలస్యం అవుతూ వస్తున్న ఈ నిబంధనలను అమలు చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు రెండు రోజుల్లో ఒక నెట్‌ వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారిపోవచ్చు. గత కొంత కాలంగా నెట్‌వర్క్‌ ఆపరేటర్ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా వినియోగదారులను ఆకర్షించేందుకు ఆపరేటర్లు  కొత్త  ఆఫర్లను ప్రకటిస్తున్నారు. వీటి కారణంగా వినియోగదారులు తరచుగా నంబర్‌ పోర్టబిలిటిని కోరుకుంటున్నారు. దీంతో ఈ సేవలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది.

గతంలో ఎంఎన్‌పీ కోసం 96 గంటలు సమయం పట్టేది. ప్రస్తుతం ఆ సమయాన్ని 48 గంటలకు కుదిస్తూ ట్రాయ్‌ నిబంధనల్లో మార్పులు చేసింది. దాని ప్రకారం ఎంఎన్‌పీకి దరఖాస్తు చేసుకున్న వినియోగదారునికి యునిక్యు పోర్టింగ్‌ కోడ్‌ (యుపీసీ) జారీ అవుతుంది. అయితే ఈ యుపీసీ అనేది కేవలం మొబైల్ నంబర్‌ వినియోగంలో ఉన్న సమయంలో మాత్రమే  జారీ అవుతుంది. దీని కోసం ట్రాయ్‌ వినియోగదారుడికి కొన్ని షరతులు విధించింది. దాని ప్రకారం, వినియోగదారుడు ప్రస్తుత నెట్‌వర్క్‌ ఆపరేటర్‌కి నెలవారి బిల్లుతోపాటు పాత బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. అలానే 90 రోజుల నుంచి ప్రస్తుత నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుండాలి. దానితో పాటు నంబర్‌ను ఒకరి పేరుమీద నుంచి మరొకరి పేరు మీదకు మార్చుకునేందుకు అవకాశం లేదు. ఇంకా ఎంఎన్‌పీ కోరుకుంటున్న నంబర్‌ చట్టం చేత నిషేధించబడింది కాకూడదు, ఆ నంబర్‌పై ఎటువంటి న్యాయపరమైన వివాదాలు ఉండకూడదు అని తెలిపింది.  

ఈ నిబంధనలు అన్నింటికి వినియోగదారులు అర్హులైతే ఎంఎన్‌పీకీ దరఖాస్తు చేసుకున్న ఐదు నిమిషాల్లో యుపీసీ జారీచేయబడుతుంది. దాని కోసం  పోర్ట్‌ అని ఆంగ్లంలో టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి మొబైల్‌ నంబర్‌ టైప్ చేసి 1900 ఎస్సెమ్మెస్‌ పంపాలి. తర్వాత ఎస్సెమ్మెస్‌ ద్వారా యుపీసీ వస్తుంది. గతంలో యుపీసీ చెల్లుబాటు కాలం 15 రోజులుగా ఉండేది. ప్రస్తుతం దీన్ని 4 రోజులకు కుదించారు (జమ్ము కశ్మర్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇది 30 రోజులుగా నిర్ణయించారు). ఎంఎన్‌పీ ప్రక్రియను ప్రారంభించడానికి అడ్రస్‌ ప్రూఫ్‌, ఐడెంటీ ప్రూఫ్‌ వంటివి సమర్పించాలి.  ఒకే సర్కిల్‌లో ఉన్న  ఆపరేటర్లకు ఎంఎన్‌పీ మూడు రోజుల్లో పూర్తవుతుంది. అదే ఇతర సర్కిల్‌లో ఉన్న ఆపరేటర్లకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపింది. కార్పొరేట్ పరిధిలోని మొబైల్‌ కనెక్షన్స్‌కు పాత నిబంధనలే వర్తిస్థాయని ట్రాయ్‌ తెలిపింది. ఒక వేళ ఎవరైనా వినియోగదారులు తమ ఎంఎన్‌పీ దరఖాస్తు ఉపసంహరించుకోవాలంటే 24 గంటల లోపల దానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ట్రాయ్‌ పేర్కొంది.    


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.