ఆర్‌బీఐ మద్దతు కావాలి - RBI needs support
close

Published : 06/05/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌బీఐ మద్దతు కావాలి

క్రెడాయ్‌, నారెడ్కో

దిల్లీ: కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి నేపథ్యంలో, స్థిరాస్తి రంగానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  సహకారం కావాలని రియల్టర్ల సమాఖ్యలు క్రెడాయ్‌, నారెడ్కో కోరుతున్నాయి. రుణ పునర్నిర్మాణం, వడ్డీపై మారటోరియం, అదనపు ద్రవ్యలభ్యత వంటి వాటిని ఆర్‌బీఐ పరిశీలించాలని ఆ సమాఖ్యలు అభ్యర్థించాయి. వ్యక్తులు, తక్కువ మొత్తం రుణ గ్రహీతలకు.. బకాయిలు చెల్లించేందుకు అదనపు సయమం ఇవ్వడాన్ని, కొవిడ్‌-19 సంబంధిత ఆరోగ్య మౌలిక వసతులు, టీకా తయారీదార్లకు, ఆసుపత్రులకు రుణాలు అందించేందుకుకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వాలని బుధవారం ఆర్‌బీఐ సూచించడాన్ని స్వాగతిస్తున్నట్లు సమాఖ్యలు పేర్కొన్నాయి. ప్రోపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు కూడా కొవిడ్‌-19 మహమ్మారి రెండో దశ నుంచి బయటపడేందుకు సాయం అందించాలని ఆర్‌బీఐకి విన్నవించారు.
*కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో గత ఏడాది గృహ విక్రయాలు 40-50 శాతం మేర క్షీణించాయి. గత అక్టోబరు నుంచి గిరాకీ వృద్ధి చెందినా, ఈ ఏడాది మార్చి నుంచి కొవిడ్‌ రెండో దశ విజృంభణతో స్థిరాస్తి రంగానికి, డెవలపర్లకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.

 

3 నెలల కనిష్ఠానికి సేవా రంగ వృద్ధి
దిల్లీ: దేశీయ సేవా రంగ కార్యకలాపాలకు కొవిడ్‌-19 సెగ తాకింది. ఏప్రిల్‌లో మూడు నెలల కనిష్ఠానికి ఈ రంగ వృద్ధి పడిపోయింది. కొవిడ్‌-19 కేసుల సంఖ్య పెరగడంతో వ్యాపార కార్యకలాపాలకు అవరోధాలు ఏర్పడ్డాయని ఓ సర్వే తెలిపింది. ఈ పరిణామంతో మున్ముందు వృద్ధి పుంజుకుంటుందనే ఆశలు సన్నగిల్లాయని పేర్కొంది. ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ ఏప్రిల్‌లో 54 పాయింట్ల వద్ద ఉంది. మూడు నెలల్లోనే వృద్ధిపరంగా ఇది కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. మార్చిలో ఇది 54.6 పాయింట్లుగా నమోదైంది. పీఎంఐ పరిభాషలో 50 పాయింట్లకు పైన సూచీ ఉంటే ఆ రంగ ఉత్పత్తిలో వృద్ధి ఉన్నట్లు, 50 పాయింట్ల దిగువన ఉంటే ఆ రంగ ఉత్పత్తిలో క్షీణత నమోదైనట్లుగా భావిస్తారు.

 

భారత ఔషధ, వైద్య ఉపకరణాల రంగాల్లో పెట్టుబడులు పెట్టండి
అమెరికా కంపెనీలకు భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంథు వినతి

వాషింగ్టన్‌: భారతదేశంలో ఔషధ, వైద్య ఉపకరణాల తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అమెరికాలోని అగ్రగామి కంపెనీలను అమెరికాలోని భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంథు కోరారు. ఫైజర్‌. పాల్‌ లైఫ్‌ సైన్సెస్‌, మార్క్‌ కాస్పర్‌, అంటిలియా సైంటిఫిక్‌.. తదితర కంపెనీల సీఈఓలతో ఆయన ఆన్‌లైన్‌లో చర్చించారు. ఫార్మా, వైద్య ఉపకరణ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశం భారత ప్రభుత్వానికి ఉందని, దీనికి సానుకూలంగా స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పీఎల్‌ఐ (ప్రొడక్టివిటీ లింక్డ్‌ ఇన్సెంటివ్‌) స్కీము వివరాలను వారికి ఆయన తెలియజేశారు. సిట్వియా సంస్థ సీఈఓ ఇమ్యాన్యుయేల్‌ లింగ్నెర్‌తోనూ తరంజిత్‌ సింగ్‌ సంథు మాట్లాడారు. పలు రకాల థెరప్యూటిక్‌ ఔషధాల పరిశోధన, తయారీలో సిట్వియా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని