ఎస్‌బీఐ ఎడిడ‌బ్ల్యుఎంతో అన్ని బ్యాంకింగ్ సేవ‌లు  - SBI-ADWM-for-key-banking-facilities
close

Updated : 08/02/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 ఎస్‌బీఐ ఎడిడ‌బ్ల్యుఎంతో అన్ని బ్యాంకింగ్ సేవ‌లు 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆటోమేటెడ్ డిపాజిట్ క‌మ్ విత్‌డ్రాయ‌ల్‌ మెషిన్‌ (ఎడిడబ్ల్యుఎం) నగదును ఉపసంహరించుకోవటానికి మాత్రమే కాదు,  కీలకమైన బ్యాంకింగ్ సౌకర్యాలను కూడా పొందవచ్చు. మీకు సమీపంలో ఉన్న ఎడిడబ్ల్యుఎం‌ లో కీల‌క‌ బ్యాంకింగ్ సదుపాయాలను పొందగలిగినప్పుడు ఎందుకు క్యూలో నిలబడాలి? దానిపై అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి మరింత తెలుసుకోండి.

ఎడిడబ్ల్యుఎం అంటే ఏమిటి?
ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్‌డ్రావల్ మెషిన్ (ఎడిడబ్ల్యుఎం) , క్యాష్ డిపాజిట్ మెషిన్ ఎటిఎమ్ లాంటి యంత్రం, ఇది ఎటిఎమ్ కమ్ డెబిట్ కార్డు ఉపయోగించి నేరుగా  ఖాతాలో నగదును జమ చేయవ‌చ్చు. ప్ర‌తీసారి బ్యాంకుకు వెళ్ల‌న‌వ‌స‌రం లేకుండా మీ ఖాతాలో  తక్షణమే న‌గ‌దును డిపాజిట్ చేయడానికి మీరు ఈ యంత్రాన్ని ఉపయోగించవచ్చు. లావాదేవీల వివ‌రాల‌ను కూడా తెలుసుకోవ‌చ్చు. 

ఎడిడబ్ల్యుఎంలో ఉన్న సేవల గురించి తెలుసుకోవాల్సిన విష‌యాలు:
* సౌకర్యవంతమైన‌, త‌క్ష‌ణ‌ నగదు డిపాజిట్ మరియు ఉపసంహరణ లావాదేవీలు
* కాగిత‌ర‌హితంగా లావాదేవీలు
* నగదు డిపాజిట్, ఉపసంహరణ రెండు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి
* మీ పీపీఎఫ్‌, రిక‌రింగ్ డిపాజిట్ లేదా రుణ ఖాతాలలో కూడా నగదు జమ చేయవచ్చు
* నగదు డిపాజిట్ - స్వీయ లేదా థ‌ర్డ్‌ పార్టీ ఎస్‌బీఐ ఖాతాల్లోకి తక్షణ క్రెడిట్
* ప్రతి లావాదేవీ పరిమితి కార్డ్‌లెస్ డిపాజిట్‌కు రూ. 49,900, డెబిట్ కార్డుల ద్వారా రూ. 2 లక్షలు ( పాన్‌తో అనుసంధానించిన ఖాతా ఆధారంగా)
* ఒకే లావాదేవీలో 200 వరకు కరెన్సీ నోట్లను జమ చేయవచ్చు
* ఈ యంత్రం రూ.100, రూ. 200, రూ. 500 & రూ. 2000 విలువ‌ను మాత్రమే అంగీకరిస్తుంది
* ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉపయోగించి సొంత‌ ఖాతాలో నగదు జమ చేయడానికి ఛార్జీలు లేవు
* కార్డ్‌లెస్ డిపాజిట్ , ఎస్ఎంఈ ఇన్‌స్టా / బిజినెస్ డెబిట్ కార్డు ఉపయోగించి నగదు డిపాజిట్‌కు నామమాత్రపు రుసుము రూ.22 తో పాటు జీఎస్టీ వ‌ర్తిస్తుంది.
*  ఈ యంత్రం ద్వారా ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఖాతాల్లోని నగదు కూడా ఉపసంహరించుకోవచ్చు.
 * యోనో క్యాష్ ఎన్‌బుల్‌డ్ ఎడీడబ్య్లూఎంఎస్ యంత్రాల‌లో కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణకు మద్దతు ఇస్తుంది
* దీంతో  మీ పాస్‌వర్డ్‌ను కూడా క్ర‌మంగా మార్చుకోవ‌చ్చు
*  ఇంకా మీ ఖాతాలో బ్యాలెన్స్ చేసుకునే స‌దుపాయం కూడా ఇందులో ల‌భిస్తుంది. మీ కార్డును స్వైప్ చేసిన తర్వాత అక్క‌డ ఉన్న ఆప్ష‌న్ మీరు ఎంచుకోవ‌చ్చు. 
* మినీ స్టేట్‌మెంట్ ద్వారా మీ ఖాతాలోని లావాదేవీలను ట్రాక్ చేయవ‌చ్చు. మినీ-స్టేట్‌మెంట్ మీ ఖాతాలోని చివరి 10 లావాదేవీల గురించి మీకు తెలుపుతుంది.
*ఈ మెషిన్ ద్వారా  గ్రీన్ పిన్ కూడా జ‌న‌రేట్ చేయ‌వ‌చ్చు
*  యోనో క్యాష్ ఉపయోగించి కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణను రూ.20,000  వరకు చేసుకోవ‌చ్చు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని