ఇంటి నుంచే బ్యాంకు ఖాతా నామినీని న‌మోదు చేయ‌వ‌చ్చు..ఎస్‌బీఐ  - SBI-nominee-online-registration-process
close

Updated : 05/02/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటి నుంచే బ్యాంకు ఖాతా నామినీని న‌మోదు చేయ‌వ‌చ్చు..ఎస్‌బీఐ 

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుడా?  ఖాతాకు నామినీని పేరును చేర్చారా?  చేర్చ‌క‌పోతే ఆన్‌లైన్ ద్వారా ఇంటి నుంచే నామినీ పేరును ఖాతాకు జ‌త‌చేయ‌వ‌చ్చు. ఇందుకోసం బ్యాంకు శాఖ‌కు వెళ్ళాల్సిన అవ‌స‌రం లేదు. ఎస్‌బీఐ అన్నిడిపాజిట్ ఖాతాల‌కు నామినేష‌న్ సౌక‌ర్యాన్ని అందిస్తుంది. 

" వ్యక్తిగత సామర్థ్యంలో( సింగ‌ల్‌ /  జాయింట‌ల్‌ ఖాతాలు,  ఏకైక యాజమాన్యం ఉన్న‌ ఖాతాలు) తెరిచిన ఖాతాలకు నామినేషన్ సౌక‌ర్యం అందుబాటులో ఉంటుంది,  ప్రతినిధిగా వ్య‌వహ‌రిస్తూ తెరిచిన ఖాతాలకు ఈ సౌక‌ర్యం వ‌ర్తించ‌దు." అని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఎస్‌బీఐ ఖాతాదారులు, బ్యాంకు బ్రాంచిని సంప్ర‌దించి గానీ, onlinesbi.com వెబ్‌సైట్‌, యోనో యాప్‌లో లాగిన్ అయ్యి నామినీ వివ‌రాల‌ను న‌మోదు చేయ‌వ‌చ్చ‌ని ఎస్‌బీఐ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఖాతాదారుల‌కు తెలియ‌జేసింది.

ఖాతాదారుడు ఎప్పుడైనా నామినీని ఎంచుకోవ‌చ్చు అదేవిధంగా ర‌ద్దు చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే చేర్చిన నామినీకి బ‌దులు మ‌రో నామినీని ఎంచుకోవ‌చ్చు. ఇందుకు సాక్షి అవ‌స‌రం. జాయింటు ఖాతా విష‌యంలో ఖాతాదారులంద‌రూ అభ్య‌ర్థ‌న ప‌త్రంపై సంత‌కం చేయాలి. 

కొత్త‌గా ఖాతా తీసుకునే వారితో పాటు, ఇప్ప‌టికే ఖాతా ఉన్న వారు కూడా నామినేష‌న్ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని బ్యాంక్ సూచిస్తుంది. ఒక‌వేళ నామినిని ఏర్పాటు చేయ‌డం ఇష్టం లేక‌పోతే,  అదే విష‌యాన్ని ఖాతా తెరిచేప్పుడు నింపే ద‌ర‌ఖాస్తు ఫారంలో ఖాతా దారుడు పూర్తి సంత‌కంతో తెలియ‌జేయాల‌ని ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో తెలిపింది.

ఎస్‌బీఐ ఖాతాకు నామినీని చేర్చే మార్గాలు..
1. బాంకు బ్రాంచికి వెళ్ళడం
2. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌
3. ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్‌

నెట్ బ్యాంకింగ్ ద్వారా నామిని వివ‌రాలు న‌మోదు చేయు విధానం..
1. ఖాతాదారుడు, యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్‌తో www.onlinesbi.com వెబ్‌సైట్ ద్వారా ఖాతాకు లాగిన్ అవ్వాలి. 
2. మెను బ‌ట‌న్‌లో ఉన్న రిక్వ‌స్ట్‌& ఎంక్వైరీస్‌ను క్లిక్ చేయాలి. 
3. 'ఆన్‌లైన్ నామినేష‌న్' ను ఎంచుకోవాలి.
4. ఒక‌టి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే అన్ని ఖాతాల‌ను ఇక్క‌డ‌ చూపిస్తుంది.
5. నామినినీ జ‌త‌చేయ‌వ‌ల‌సిన ఖాతాను ఎంచుకుని, కంటిన్యూ టాబ్‌పై క్లిక్ చేయాలి.
6. ఇక్క‌డ నామినీ పేరు, పుట్టిన తేది, చిరునామా, వారితో ఖాతాదారునికి ఉన్న సంబంధం త‌దిత‌ర వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేయాలి. 
7. బ్యాంక్ వ‌ద్ద రిజ‌స్ట‌ర్ అయిన మొబైల్ నెంబ‌రు వ‌చ్చే అధిక బ‌ద్ర‌త పాస్‌వర్డ్‌ను ఎంట‌ర్ చేయాలి. 
8. కొత్త నామినినీ జ‌త చేసేందుకు కన్‌ఫ్రిమ్‌పై క్లిక్ చేయాలి. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని