Stock market Closing bell: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు! - Sensex Jumped over 500pts
close

Updated : 21/09/2021 21:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market Closing bell: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

ముంబయి: రెండు రోజుల నష్టాల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈరోజు కోలుకున్నాయి. ఉదయం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే, అవి ఎంతసేపు నిలవలేదు. చైనా కంపెనీ ఎవర్‌గ్రాండే సంక్షోభం సహా కరోనా భయాలు మార్కెట్లను కలవరపెట్టాయి. దీంతో రోజులో ఎక్కువ సేపు సూచీలు ఊగిసలాటలో పయనించాయి. చివరకు ఐరోపా మార్కెట్లు, అమెరికా ఫ్యూచర్స్‌ నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న మార్కెట్లు ఒక్కసారిగా లాభాల్లోకి ఎగబాకి ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.73.62 వద్ద ముగిసింది. 

సెన్సెక్స్‌ ఉదయం 58,630.06 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,084.51 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 514.34 పాయింట్ల లాభంతో 59,005.27 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో మెజారిటీ లాభపడ్డాయి. బజాజ్ ఫినాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు మెరిశాయి. మారుతీ, బజాజ్‌ ఆటో, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ డీలాపడ్డాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని