ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఉదయం ఊగిసలాటతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు క్రమంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో బడ్జెట్ తర్వాత కొనసాగిన ర్యాలీ నేపథ్యంలో వచ్చిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల కీలక మార్క్ (సెన్సెక్స్ 50,000; నిఫ్టీ 15,000)ను అందుకున్న సూచీలు వాటిని కోల్పోయాయి.
సోమవారం 50,936 వద్ద స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ కాసేపు లాభాల్లో పయనించింది. ఇంట్రాడేలో 50,975 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం క్రమంగా నష్టాల్లోకి జారుకున్న సూచీకి ఏ దశలోనూ మద్దతు లభించకపోవడంతో అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. ఓ దశలో 1,257 పాయింట్లు కోల్పోయి 49,632 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 1,145.44 పాయింట్ల నష్టంతో 49,744.32 వద్ద, నిఫ్టీ 306.05 పాయింట్లు కోల్పోయి 14,675.70 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.
ఉదయం సానుకూలంగా ప్రారంభమైన ఆసియా మార్కెట్లు తర్వాత మిశ్రమ ఫలితాలు చవిచూశాయి. దీంతో సూచీల సెంటిమెంటు మరింత బలహీనపడింది. దీనికి తోడు ఐటీ, వాహన, ఇంధన, విద్యుత్, టెక్, పీఎస్‌యూ, స్థిరాస్తి, బ్యాంకింగ్, ఆర్థికం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండడం సూచీలపై ఒత్తిడి పెంచింది. లోహ, బేసిక్ మెటీరియల్స్ రంగాల సూచీలు లాభాల్లో కొనసాగడం నష్టాల్ని కాస్త పరిమితం చేశాయనే చెప్పాలి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఓఎన్జీసీ షేర్లు లాభపడగా.. ఐటీసీ లిమిటెడ్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.
మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలు...
మళ్లీ కమ్ముకున్న కరోనా భయాలు..
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరగడం సూచీలపై ప్రభావం చూపింది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఆ రాష్ట్రంలో మరోసారి ఆంక్షలు విధించారు. గత నాలుగు వారాల్లో సగటున ఒక వారంలో నమోదైన కేసుల సంఖ్య 18,200 నుంచి 21,300కు పెరిగింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. దీనిపై జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతినిధి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా కేసుల సంఖ్య పెరగడంపై మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిపారు. మరికొంత కాలం పాటు ఈ ఆందోళనల్ని మదుపర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉందన్నారు.
తగ్గిన ఎఫ్‌పీఐల పెట్టుబడులు..
కరోనా కేసుల పెరుగుదల విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఫిబ్రవరి 19న రూ.118.75 కోట్ల విలువ చేసే షేర్లను మాత్రమే కొనుగోలు చేశారు.
బలహీన అంతర్జాతీయ సంకేతాలు...
ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు వెలువడకపోగా.. బాండ్ల మార్కెట్లో అస్థిరత ఈక్విటీ సూచీలను ప్రభావితం చేశాయి. అమెరికాలో పదేళ్ల బాండ్ల ఈల్డ్ పెరగడం మార్కెట్లలో ద్రవ్యోల్బణ భయాలను నింపింది. దీంతో దేశీయ మదుపర్లకు ఎలాంటి దన్ను లభించక ప్రతికూలంగా స్పందించారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?