వైద్యపరికాల సరఫరా సమస్యలకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌! - Special help desk under DGFT for exim related issues
close

Published : 26/04/2021 22:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైద్యపరికాల సరఫరా సమస్యలకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌!

ఏర్పాటు చేసిన కేంద్ర వాణిజ్య శాఖ

దిల్లీ: కరోనా నివారణ నిమిత్తం వివిధ పరికరాలు, ఔషధాల ఎగుమతులు, దిగుమతులు త్వరితగతిన సాగేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌-డీజీఎఫ్‌టీ’ ఆధ్వర్యంలో కేంద్ర వాణిజ్య శాఖ ఓ ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఎగుమతులు, దిగుమతులకు కావాల్సిన అనుమతులు, కస్టమ్స్‌ క్లియరెన్సులు, డాక్యుమెంటేషన్‌, బ్యాంకింగ్‌ వంటి సమస్యల్లో జాప్యాన్ని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతారు.

ఈ నేపథ్యంలో ఎగుమతి, దిగుమతిదారులు లేదా ఇతర వ్యాపారస్థులు తమ సమస్యలను డీజీఎఫ్‌టీ వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేయవచ్చు. అలాగే ఫిర్యాదుకు సంబంధించిన పరిష్కారం ఎంత వరకు వచ్చిందో కూడా వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌, మెయిల్‌ ద్వారా కూడా సమాచారాన్ని తెలియజేస్తారు. విదేశాల నుంచే వచ్చే పరికరాలు, ఔషధాల అనుమతుల విషయంలో సమస్యలు రాకుండా, ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు వాణిజ్యశాఖ వెల్లడించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని