Stock Market: లాభాల్లో సూచీలు - Stock market indices trading higher
close

Updated : 24/05/2021 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 188 పాయింట్లు లాభపడి 50,729  వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 39 పాయింట్లు ఎగబాకి 15,211 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.3 వద్ద కొనసాగుతోంది.

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతుండడంతో పాటు, టీకాల ఉత్పత్తి పెంచే యత్నాలు వేగవంతం కావడంతో మార్కెట్‌లో సానకూల సెంటిమెంటు మెరుగుపడింది. కీలక రంగాల్లోని షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. 

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఇండియా సిమెంట్స్‌, జె.కె.పేపర్‌, మహానగర్‌ గ్యాస్‌, రామ్‌కో ఇండస్ట్రీస్‌, రామ్‌కో సిమెంట్స్‌ కంపెనీలు నేడు త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. బీఎస్‌ఈ 30 సూచీలో టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, ఏషియన్‌ పెయింట్స్‌ ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో పయనిస్తుండగా.. ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని