Stock market: సూచీల్లో లాభాల జోరు - Stock markets Ended in green
close

Published : 13/07/2021 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: సూచీల్లో లాభాల జోరు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. వ్యాక్సినేషన్‌లో పురోగతి, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెన్స్‌ 397 పాయింట్ల లాభంతో 52,769 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 15,812 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.47 వద్ద నిలిచింది. బ్యాంకింగ్‌, ఆర్థిక, లోహ రంగ షేర్లు రాణించాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ముగియగా.. డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని