Stock market: ఆరంభ లాభాలు ఆవిరి - Stock markets Ended in red
close

Published : 06/07/2021 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఆరంభ లాభాలు ఆవిరి

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో మంగళవారం భారీ సర్దుబాటు కనిపించింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేశాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 249 పాయింట్లు లాభపడి 53,129 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం తొలిసారి 15,900 మార్క్‌ను దాటింది. దీంతో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో చివరి గంటలో ఆటో, ఐటీ, టెక్, ఇంధన రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్‌ 18 పాయింట్లు నష్టపోయి 52,861 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 16 పాయింట్లు కోల్పోయి 15,818 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.55 వద్ద నిలిచింది. జీఎస్టీ వసూళ్లు తగ్గడం, జూన్‌ ద్రవ్యోల్బణ గణాంకాలపై ప్రతికూల సంకేతాలు సైతం చివరలో సూచీలపై ప్రభావం చూపాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటాక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, మారుతీ, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని