Stock market: లాభాల్లో సూచీలు - Stock markets are in green
close

Updated : 12/07/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 268 పాయింట్ల లాభంతో 52,654 వద్ద.. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 15,771 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.52 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గత వారాన్ని లాభాలతో ముగించాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. దేశీయంగా బ్యాంకింగ్‌, స్థిరాస్తి, లోహ, మౌలిక రంగాలు రాణిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీలు లాభాల బాట పట్టాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని