Stock Market: లాభాల్లో సూచీలు..జొమాటోపై ఆసక్తి! - Stock markets are in green
close

Updated : 23/07/2021 10:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాల్లో సూచీలు..జొమాటోపై ఆసక్తి!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అమెరికా సూచీలు గురువారం లాభాలతో ముగియగా.. నేడు ఆసియా-పసిఫిక్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. కొవిడ్‌ భయాలకు.. సాంకేతిక సంస్థలపై చైనా విధిస్తున్న ఆంక్షలు తోడయ్యాయి. దీంతో ఆసియా మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఉదయం 9:55 గంటల సమయంలో సెన్సెక్స్‌ 65 పాయింట్ల నష్టంతో 52,896 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 15,837 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.92 వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఇంధన, లోహ, స్థిరాస్తి, విద్యుత్తు రంగాల నుంచి సూచీలకు మద్దతు లభిస్తోంది. 

జొమాటో లిమిటెడ్‌ షేర్లు నేడు తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి. దీంతో మదుపర్లంతా ఈ షేరు కదలికలపై దృష్టి సారించారు. ఈ రంగానికి భవిష్యత్తుల్లో మంచి వృద్ధి ఉందన్న అంచనాల నేపథ్యంలో జొమాటోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా చాలా ఫిన్‌టెక్‌ సంస్థలు ఐపీఓకు రానున్న నేపథ్యంలో జొమాటో వాటికి బూస్ట్‌ ఇవ్వనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
బీఎస్‌ఈ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటన్‌, మారుతీ, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా..హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని