Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు - Stock markets opened on flat
close

Published : 29/06/2021 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 52,754 వద్ద.. నిఫ్టీ 3 పాయింట్లు లాభపడి 15,818 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.29 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ఆసియాలో పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగడంతో ఆసియా సూచీలు నేడు నష్టాల బాట పట్టాయి. దీంతో చమురు ధరలు సైతం 2శాతానికి పైగా పడిపోయాయి. 

బీఎస్‌ఈ 30 సూచీలో పవర్‌ గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, టైటన్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని