ఈపీఎఫ్ఓలో బ్యాంక్ వివ‌రాలు అప్‌డేట్ చేసుకోండి  - Update-bank-details-through-online-in-EPFO-account
close

Updated : 11/01/2021 15:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 ఈపీఎఫ్ఓలో బ్యాంక్ వివ‌రాలు అప్‌డేట్ చేసుకోండి 

ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఈపీఎఫ్ ఖాతా నుంచి సుల‌భంగా ఆన్‌లైన్ ద్వారా విత్‌డ్రా చేసుకునే స‌దుపాయం క‌ల్పించింది. లావాదేవీల‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా జ‌ర‌గాలంటే స‌రైన బ్యాంకు వివ‌రాల‌ను ఈపీఎఫ్ ఖాతాకు జ‌తచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈపీఎఫ్‌కి అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాల్ని మూసివేస్తుంటారు. అటువంటి స‌మ‌యంలో మ‌రో బ్యాంకు ఖాతాను ఈపీఎఫ్ ఖాతాలో అప్‌డేట్ చేయ‌డం మ‌ర్చిపోతారు.  బ్యాంకు ఖాతా వివ‌రాలు స‌రైన‌వి లేక‌పోతే లావాదేవీలు జ‌ర‌గ‌వు. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా బ్యాంకు వివ‌రాల‌ను సుల‌భంగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. 

 ఇక్క‌డ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాంకు వివ‌రాల‌ను ఎలా అప్‌డేట్ చేసుకోవాలో చూద్దాం:
1. ఈపీఎఫ్ఓ ఖాతాలో మీ యూజ‌ర్‌నేమ్‌, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ కావాలి.
2.  'Manage' ట్యాబ్ క్లిక్ చేయాలి
3. అక్క‌డ మెనులో  'KYC'  ఆప్ష‌న్ సెల‌క్ట్ చేసుకోవాలి.
4. బ్యాంక్ అని సెల‌క్ట్ చేసుకొని, బ్యాంక్ ఖాతా సంఖ్య‌, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ని ఎంట‌ర్ చేసి 'Save' క్లిక్ చేయాలి
5. దీనిని యాజ‌మాన్య సంస్థ ఆమోదించిన త‌ర్వాత అప్‌డేట్ చేసిన‌ బ్యాంక్ వివ‌రాలు కేవైసీ విభాగంలో కనిపిస్తాయి. 

డిసెంబ‌ర్ చివ‌రి నుంచి ఈపీఎఫ్ఓ చందాదారుల‌కు 8.5 శాతం క్రెడిట్ చేయ‌డం ప్రారంభించింది. సెప్టెంబ‌ర్‌లో ఈపీఎఫ్ఓ బోర్డు 8.5 శాతం వ‌డ్డీ ని నిర్ణ‌యించింది. మార్చి 31 ముగిసిన ఆర్థిక సంవ‌త్స‌రానికి ఇది వ‌ర్తిస్తుంది. వ‌డ్డీ రేటు 8.15 శాతం, 0.35 శాతంగా విభ‌జించారు. అయితే డిసెంబ‌ర్‌లో  8.5  శాతం ఒకేసారి క్రెడిట్ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని