కారు రుణం.. ఇది కొత్త కారు కొనడానికి ఉత్సాహం కలిగిస్తుంది. ఇది అప్‌గ్రేడ్ అయినా, మొదటి కారు అయినా లేదా కుటుంబానికి మరొక కారు అయినా, కారణం ఏమైనప్పటికీ, కారు లోన్ కొనుగోలును సులభతరం చేస్తుంది.
కారు కొనడానికి రుణాలు ఇచ్చే బ్యాంకులు సాధారణంగా 3 నుండి 5 సంవత్సరాల కాల పరిమితితో రుణాలు ఇస్తాయి. కానీ, కొన్ని రుణ సంస్థలు 7 సంవత్సరాల కాల పరిమితి వరకూ కూడా రుణాలు ఇవ్వవచ్చు. ఎక్కువ కాలం రుణం అంటే చిన్న సమానమైన నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) కారును మరింత సరసమైనదిగా అనిపిస్తుంది. కానీ, మొత్తం మీద మీరు వడ్డీగా ఎక్కువ చెల్లిస్తారు. కారు తరుగుదల ఆస్తి కూడా. కాబట్టి పెద్ద రుణం, ఎక్కువ కాల పరిమితితో కూడిన రుణం తీసుకోకపోవడమే మంచింది. మరీ తక్కువ కాలానికి రుణం తీసుకుంటే ఎక్కువ ఈఎంఐ పడుతుంది. టైమ్‌కి రుణ వాయిదా కట్టకపోతే క్రెడిట్ రిపోర్ట్‌పై మచ్చ పడుతుంది. రుణాన్ని ఎంత తీసుకోవాలి, ఎంత కాల పరిమితికి తీసుకోవాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది రుణదాతలు కారు యొక్క పూర్తి ఎక్స్-షోరూమ్ ధర మీద రుణం ఇస్తారు. మరికొందరు కారు ధరలో 80% వరకు రుణం ఇవ్వవచ్చు.
కారు రుణంపై వడ్డీరేటు కాకుండా, వర్తించే ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర ఛార్జీలు ఈ కింద టేబుల్లో ఉన్నాయి.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?