SBI: ఆన్‌లైన్‌లోనే బ్రాంచ్‌ మార్పు - change your SBI branch online
close

Published : 10/05/2021 21:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SBI: ఆన్‌లైన్‌లోనే బ్రాంచ్‌ మార్పు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వేళ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ సేవింగ్స్‌ ఖాతా ఉన్న బ్యాంకు శాఖను మార్చుకోవాలంటే బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎస్‌బీఐకి చెందిన యోనో ఎస్‌బీఐ, యోనో లైట్‌ యాప్‌లతో పాటు ఆన్‌లైన్‌ ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ ద్వారా మార్చుకోవచ్చని తెలిపింది. కరోనా వేళ బ్యాంకుల వద్ద రద్దీని నియంత్రించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్‌ చేసింది.

బ్యాంక్‌ శాఖను మార్చుకోవాలంటే ముందుగా మీరు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వినియోగదారులై ఉండాలి. ఇది వరకే సదరు బ్రాంచ్‌లో మీ మొబైల్‌ నంబర్‌ వివరాలు నమోదై ఉండాలి. ముందుగా ఎస్‌బీఐ ఆన్‌లైన్‌లో పర్సనల్‌ బ్యాంకింగ్‌ విభాగంలోకి వెళ్లి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత ఈ-సర్వీస్‌ విభాగంలోకి వెళ్లాలి. అందులో ట్రాన్స్‌ఫర్‌ సేవింగ్స్‌ అకౌంట్‌పై ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మీరు మార్చుకోవాలనుకుంటున్న బ్రాంచ్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎంటర్‌ చేయాలి. వివరాలు పూర్తి చేశాక మీకో ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత కొద్దిరోజుల్లో మీ అకౌంట్‌ సదరు శాఖకు మారుతుంది. యోనో యాప్‌, యోనో లైట్‌లో సైతం ఇదే ప్రక్రియ ఉంటుంది. అందుకోసం ముందుగా మీ బ్యాంక్‌ ఖాతాను అనుసంధానించాల్సి ఉంటుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని