కొవిషీల్డ్: కేంద్రానికి రూ.200..ప్రైవేటులో..? - covishield will be sold to the indian government two hundred rupees per dose
close

Published : 04/01/2021 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిషీల్డ్: కేంద్రానికి రూ.200..ప్రైవేటులో..?

వెల్లడించిన సీరం సంస్థ సీఈఓ

దిల్లీ: తాము ఉత్పత్తి చేస్తోన్న కరోనావైరస్ టీకా ‘కొవిషీల్డ్‌’ను ప్రభుత్వానికి ఒక్కో డోసు రూ.200 చొప్పున విక్రయిస్తామని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. ప్రభుత్వం అనుమతించిన తర్వాత ప్రైవేటు మార్కెట్లో విక్రయించే సమయంలో దాని విలువ రూ.1000గా ఉంటుందని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కరోనావైరస్ టీకాను భారత్‌లో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆదివారం కేంద్రం నుంచి భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులు కూడా పొందింది. 

టీకా వినియోగానికి అనుమతులు పొందిన నేపథ్యంలో అదర్ మీడియాతో మాట్లాడారు. మొదటి 100 మిలియన్ల డోసులను భారత ప్రభుత్వానికి ప్రత్యేక ధరకు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. రూ.200లకు ఒక డోసు చొప్పున అందిస్తున్నామన్నారు. అదే ప్రైవేటు మార్కెట్లో ఆ ధర రూ.1,000 ఉంటుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం తుది దశకు చేరుకున్న వారం, పది రోజుల్లో టీకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రైవేటు మార్కెట్లలో విక్రయం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం మేం భారత ప్రభుత్వానికి మాత్రమే టీకాలు అందించగలమని చెప్పారు. 

అలాగే 300 నుంచి 400 మిలియన్ల డోసుల టీకాలను అందించే ఉద్దేశంతో తాము ఐరాస ‘కొవాక్స్’‌ ప్రాజెక్టు ఒప్పందంపై సంతకం చేసే దశలో ఉన్నామని అదర్ తెలిపారు. 2021 డిసెంబర్ నాటికి దానికి 200 నుంచి 300 మిలియన్ల డోసులు అందించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. టీకా పంపిణీ విషయంలో భారత్ దేశానికి.. కొవాక్స్ ప్రాజెక్టు మధ్య సమతుల్యతను పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 టీకాలు అందరికి లభించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాక్స్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది.

ఇవీ చదవండి:

అతి పెద్ద టీకా పంపిణీ..త్వరలో ప్రారంభం: మోదీ

దేశం గర్వించదగ్గ సందర్భం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని