‘మా’ కష్టాలు చూశాక.. భారత్‌ మేలుకో..! - fdi reforms to provide much needed impetus to insurance industry
close

Updated : 25/01/2021 11:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మా’ కష్టాలు చూశాక.. భారత్‌ మేలుకో..!

ఇప్పటికీ ఆశావాహంగా ఎఫ్‌డీఐ అవకాశాలు..
బడ్జెట్‌ 2021 వేదిక కావాలి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ట్రంప్‌ పదవి దిగి  వెళ్లిపోయారు.. బైడెన్‌ వాణిజ్య యుద్ధంలో ఆచితూచి వ్యవహరిస్తారు.. చైనా నుంచి కంపెనీలు వెళ్లడం ఆగిపోయాయి అనుకుంటే పొరబాటే. ఇటీవల ప్రపంచ కుబేరుడు ‘జాక్‌మా’కు పట్టిన గతి చూశాక చైనాలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  భారత్‌కు ఇంతకు మించిన సమయం రాదు. ఎఫ్‌డీఐ విధానాల్లో ఆకర్షణీయమైన మార్పులు చేస్తే ప్రపంచ స్థాయి పెట్టుబడి దారులు భారత్‌ వైపు చూడటం ఖాయం.  

వాస్తవానికి కర్ణాటకలోని విస్ట్రాన్‌ కంపెనీలో జరగిన అల్లర్లు భారత్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేవిగా ఉన్నాయి. చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక భారత్‌లో పెట్టుబడులు పెడితే ఇలానే ఉంటుందంటూ ఓ కథనం కూడా రాసి మనకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నించింది.  కానీ, ఇప్పుడు ‘జాక్‌ మా’ మాయంతో పాటు ‘ఆలీబాబా’ సంస్థను చైనా జాతీయం చేయాలనే ప్రతిపాదనులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి నిజంగా విదేశీ పెట్టుబడిదారులను వణికించేవే. భారత్‌ ఇలాంటి అవకాశాలను అనుకూలంగా మార్చుకొని పెట్టుబడులను ఆకర్షించాలి. ఎందుకంటే ప్రపంచంలో చైనా తర్వాత మరే దేశం వద్దలేని మానవ వనరులు భారత్‌లో ఉన్నాయి. 

ప్రతి ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అత్యంత కీలకమైనవి. చైనాలో కూడా అమెరికా పెట్టుబడులు పెరిగిన తర్వాతే అభివృద్ధి సాధ్యమైంది. విదేశీ సంస్థలు పెట్టుబడులతోపాటు టెక్నాలజీని కూడా తీసుకొస్తాయి. ఇది అత్యంత కీలకమైంది. అదే 2019-20 మధ్యలో రూ.74,390 కోట్ల డాలర్లు వచ్చాయి.  ఈ ఆర్థిక సంవత్సరం భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సెప్టెంబర్‌ నాటికి 15 శాతం పెరిగి 39 బిలియన్‌ డాలర్లను దాటాయి.  భారత్‌లో ముఖ్యంగా సర్వీస్‌, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, టెలికమ్యూనికేషన్స్‌, ట్రేడింగ్‌, నిర్మాణ రంగం, ఆటోమొబైల్‌, కెమికల్స్‌, ఫార్మా రంగాల షేర్లు వీటిల్లో ఉన్నాయి.  భారత్‌ ర్యాంకు కూడా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 63వ స్థానానికి చేరింది. ఇదే ఊపు కొనసాగితే ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండే అవకాశం ఉంది. 

భారత్‌ ఇప్పటికే పలు సెక్టార్లలో ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తోంది. వీటిల్లో జాప్యాలను నివారించాలి. ఫలితంగా ఇది ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తుంది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో స్మార్ట్‌గ్రిడ్లను ఏర్పాటు చేయాలి. నీరు, గాలి, సౌరశక్తి నుంచి వచ్చే విద్యుత్తును దీనికి అనుసంధానించాలి.  ఇలాంటి ప్రాజెక్టులు ఎఫ్‌డీఏలను ఆకర్షిస్తాయి. ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన ఎస్‌వోపీలు, పాదర్శక నిర్ణయాలు తీసుకోవాలి. ఎఫ్‌డీఐలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించాలి. వీటిల్లో జాప్యం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలను ఇస్తుంది. 

ఇక ప్రస్తుత పాలసీల విషయాన్నికి వస్తే.. అవి ఎక్కువగా అసెంబ్లింగ్‌ను ప్రోత్సహించేవిగా ఉన్నాయి. ఇది ఏమాత్రం సరిపోదు. భారత్‌లో తయారీ మొదలైతేకానీ.. ముడిపదార్థాల ప్రాసెసింగ్‌ పరిశ్రమలు వంటి వాటికి ఊపురాదు. లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి రంగంలో ముందున్న దేశాలను మనం ఎప్పటికీ దాటలేము. 

భారత్‌ కీలక నిర్ణయాలు..

* ఎఫ్‌డీఐల పెట్టుబడికి భారత్‌కు కీలక నిర్ణయాలు తీసుకొంది. ఈ క్రమంలో ఎఫ్‌డీఐ పాలసీల్లో మార్పులు చేసే అధికారాన్ని ఆర్‌బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వానికి మార్చారు. 

* అనుమతులు ఇచ్చే క్రమంలో పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్స్‌ను స్పష్టంగా వెల్లడించారు.

* డిఫెన్స్‌, సివిల్‌ ఏవియేషన్‌, ఇన్స్యూరెన్స్‌ వంటి రంగాల్లో నిబంధనలను సడలించారు. 

* అనుమతుల ఆలస్యాలను తగ్గించడానికి సెటిల్మెంట్ స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. ఇవి సమయాన్ని ఆదా చేస్తున్నాయి. 

* విదేశీ పెట్టుబడిదారులు చేసే స్వల్ప ఉల్లంఘనలకు భారీ శిక్షలను విధించి భయపెట్టకూడదు. ఇండిపెండెంట్‌ నాన్‌ రెసిడెంట్‌ డైరెక్టర్లను కూడా ప్రాసిక్యూట్‌ చేసే చట్టాలు ఈ కోవలోకే వస్తాయి. వీటికి సంబంధించి సెటిల్మెంట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.  లేకపోతే ‘పోలీస్‌ రాజ్యం ’ వంటి ముద్ర పడిపోతుంది. భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి జంకుతారు. 

బడ్జెట్‌లో ఆశిస్తోంది ఇవే..

* ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, తయారీ రంగాలకు అవసరమైన మౌలిక వనరుల అభివృద్ధికి కేటాయింపులు ఈ సారి భారీగా పెరగాలి.  

* బడ్జెట్‌లో కార్పొరేట్‌ పన్ను విధానాన్ని ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేలా తీర్చి దిద్దాలి. దీంతోపాటు గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌లో ఉన్న లోపాలను సరిదిద్దాలి. అత్యధిక పన్ను స్లాబ్‌లు, ఇన్‌పుట్‌ క్రెడిట్ల విషయంలో ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించాలి. సింగపూర్‌ వంటి దేశాలు అనుసరించే స్నేహపూర్వక పన్ను విధానాలను పాటించాలి. 

* గతేడాది ప్రభుత్వం ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటీవ్‌లను ఉత్పత్తి రంగానికి ప్రకటించింది. ఇలా పథకాలను మిగిలిన రంగాలకు కూడా విస్తరింపజేయాలి. ఇలాంటివి భారత్‌ను అసెంబ్లింగ్‌ కేంద్రంగా నుంచి తయారీ హబ్‌గా మారుస్తాయ.

ఇవీ చదవండి

ఊరట లభిస్తుందా?
వృద్ధులకు పన్నుపోటు తప్పేనా..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని