డ్రోన్‌ పైలెట్లకు శిక్షణ
close

Updated : 04/02/2021 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రోన్‌ పైలెట్లకు శిక్షణ

ఎయిర్‌బస్‌తో ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: డ్రోన్‌ పైలెట్లకు శిక్షణ ఇప్పించే నిమిత్తం (రిమోట్‌లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌- ఆర్‌పీఏఎస్‌) ఎయిర్‌బస్‌తో హైదరాబాద్‌కు చెందిన ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా- 2021 లో భాగంగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నట్లు ఎయిర్‌బస్‌ వెల్లడించింది. ఈ శిక్షణకు సంబంధించిన పాఠ్యాంశాలు, ఇతర ప్రమాణాలను ఇరుపక్షాలు చర్చించి ఖరారు చేస్తాయని పేర్కొంది. ‘డ్రోన్‌ టెక్నాలజీ వినియోగం అన్ని విభాగాల్లో శరవేగంగా పెరుగుతోంది. సైన్యం, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఈ పరిజ్ఞానంపై ఆధారపడుతున్నాయి. అందువల్ల దీనికి అవసరమైన శిక్షణకు ప్రాధాన్యం పెరిగింది’ అని ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ సీఈఓ కెప్టెన్‌ మమత వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40,000 డ్రోన్లు ఉన్నట్లు అంచనా. ఈ సంఖ్య మరో అయిదేళ్లలో 10 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. దీనికి దాదాపు 5 లక్షల మంది డ్రోన్‌ పైలెట్లు కావాలి. వారికి ఎంతో నైపుణ్యాలతో కూడిన శిక్షణ కావాలి. ఈ నేపధ్యంలో ఎయిర్‌బస్‌తో ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ భాగస్వామ్యం కుదర్చుకోవటానికి ప్రాధాన్యం ఏర్పడింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని