అదనపు సమాచారం ఇవ్వండి
భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్లకు సబ్జెక్టు నిపుణుల కమిటీ సూచన
ఈనాడు, హైదరాబాద్: ‘కొవాగ్జిన్’ టీకాను 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలపై పరీక్షించడానికి అనుమతి కోరిన భారత్ బయోటెక్‌ను.. టీకాకు సంబంధించిన ప్రభావశీలత సమాచారాన్ని అందజేయాలని భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) సారథ్యంలోని సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) కోరినట్లు తెలిసింది. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ అనుమతి కింద ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్నారు. ఈ అనుమతి షరతు ప్రకారం 18 ఏళ్ల కంటే పైబడిన వారికి మాత్రమే ఇవ్వాలి. పిల్లలపై దీని ప్రభావశీలత పరీక్షించలేదు కాబట్టి, ఇప్పుడు అటువంటి పరీక్షలు నిర్వహించడానికి భారత్ బయోటెక్ సన్నద్ధమవుతోంది. అందుకు అనుమతి కోరగా, మరికొంత సమాచారం కావాలని ఎస్ఈసీ సూచించినట్లు తెలిసింది.
అదే విధంగా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌ను కూడా స్పుత్నిక్ వి టీకా భద్రత, రోగ నిరోధక శక్తి (ఇమ్యూన్ రెస్పాన్స్)కి సంబంధించిన సమాచారాన్ని సమర్పించాల్సిందిగా ఎస్ఈసీ సూచించించినట్లు తెలిసింది. రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్ తయారు చేసిన ఈ కొవిడ్-19 టీకాను మనదేశంలో విక్రయించడానికి వీలుగా దీనిపై డాక్టర్ రెడ్డీస్ ఇక్కడే క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తోంది. స్పుత్నిక్ వి టీకాకూ అత్యవసర వినియోగ అనుమతి కోరుతూ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసింది. ఈ సమాచారం అందించిన తర్వాత, అది సంతృప్తికరంగా ఉన్నట్లయితే స్పుత్నిక్ వి టీకాకు అత్యవసర వినియోగ అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. నేను ఒక రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని, పెన్షన్ వస్తోంది. నేను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తుంటాను. దీనికి స్వల్ప కాల, దీర్ఘకాల మూలధన పన్ను ఎలా ఉంటుంది?
-
Q. ఏజెంట్ ద్వారా కాకుండా ఆన్లైన్ లో టర్మ్ పాలసీ తీసుకోవడం వలన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేక లాభం ఏమైనా ఉంటుందా?
-
Q. నమస్తే సర్, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, సిప్ మధ్య తేడా వివరించగలరు? వీటిలో ఎందులో ఇన్వెష్ట్ చేస్తే మంచిది అని చెప్పగలరు.