ప్రభుత్వ బ్యాంకులపై రూ.2,000 కోట్ల భారం
close

Published : 05/04/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ బ్యాంకులపై రూ.2,000 కోట్ల భారం

మారటోరియంపై సుప్రీం తీర్పు నేపథ్యం

దిల్లీ: మారటోరియం కాలానికి చక్రవడ్డీని మాఫీ చేయాలని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌యూ)లపై రూ.1,800-2,000 కోట్ల భారం పడనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మార్చి-ఆగస్టు 2020 మధ్య కాలంలో మారటోరియం ఎంచుకున్న అన్ని రుణ ఖాతాల వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ)ని మాఫీ చేయాలంటూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత 60 శాతం మంది రుణ గ్రహీతలు మారటోరియంను ఎంచుకోగా, తర్వాత క్రమంగా అది 40 శాతానికి తగ్గింది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్న కార్పొరేట్లు 25 శాతమే మారటోరియం ఎంచుకున్నారని తెలుస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని