close

Published : 12/04/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంక్షిప్తంగా

* చత్తీస్‌గఢ్‌లోని ఎన్‌డీఎండీసీ నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రత్యేక సంస్థగా విడదీసే ప్రక్రియ ఈ ఏడాది ఆగస్టు- సెప్టెంబరుకు పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
* గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో పసిడి ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు నాలుగింతలు పెరిగి రూ.6,900 కోట్లకు చేరాయని యాంఫీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019-20లో ఈ పెట్టుబడులు రూ.1,614 కోట్లుగా ఉన్నాయి.
* వచ్చే మూడేళ్లలో విద్యుత్‌ వాహన వ్యాపారంలో రూ.3000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అనీశ్‌ షా వెల్లడించారు.
* పింఛన్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని ప్రభుత్వం 74 శాతానికి పెంచే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లు రావొచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఈ పరిమితి 49 శాతంగా ఉంది.
* దేశవ్యాప్తంగా 2023 నాటికి 50 సంప్రదాయ రిటైల్‌ స్టోర్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన అంకురసంస్థ ఫిట్‌డే ప్రకటించింది. ఇందుకోసం దాదాపు రూ.60 కోట్ల పెట్టుబడులు పెడతామని తెలిపింది.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని