ఎస్‌బీఐ డిజిటల్‌ సేవలకు నేడు అంతరాయం
close

Published : 07/05/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌బీఐ డిజిటల్‌ సేవలకు నేడు అంతరాయం

దిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు చెందిన వివిధ డిజిటల్‌ సేవలకు శుక్రవారం సాయంత్రం అంతరాయం కలగనుంది. బ్యాంకు తన డిజిటల్‌ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫారాలన్నిటినీ అప్‌గ్రేడ్‌ చేస్తుండడం ఇందుకు నేపథ్యం. ‘మే 7, 2021 తేదీ రాత్రి 22:15 నుంచి మే 8, 2021 తెల్లవారుజాము 1:45 వరకు నిర్వహణ కార్యకలాపాలను చేపట్టనున్నాం. ఈ సమయంలో ఐఎన్‌బీ/యోనో/యోనోలైట్‌/యూపీ సేవలు అందుబాటులో ఉండవు. అసౌకర్యానికి చింతిస్తున్నామ’ని ఎస్‌బీఐ గురువారం ట్వీట్‌ చేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని