బజాజ్‌ హెల్త్‌కేర్‌ నుంచి ఐవర్‌మెక్టిన్‌ ఔషధం
close

Published : 07/05/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బజాజ్‌ హెల్త్‌కేర్‌ నుంచి ఐవర్‌మెక్టిన్‌ ఔషధం

దిల్లీ: కొవిడ్‌-19 బాధితులకు వైద్యులు సిఫారసు చేస్తున్న ఐవర్‌మెక్టిన్‌ ఔషధాన్ని బజాజ్‌ హెల్త్‌కేర్‌ దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ‘ఐవ్‌జాజ్‌’ బ్రాండు పేరుతో దీన్ని విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇది యాంటీ-పారసైటిక్‌ ఔషధం. దీన్ని తలలో పేలు వ్యాధిని అదుపు చేయడానికి వినియోగిస్తారు. కొవిడ్‌-19 వెలుగు చూసినప్పటి నుంచి బాధితులకు వైద్యులు సిఫారసు చేస్తున్న ఔషధాల్లో ఐవర్‌మెక్టిన్‌ కూడా ఒకటి కావడం గమనార్హం. రోగి స్థితిని బట్టి ఒక ట్యాబ్లెట్‌ లేదా మూడు నుంచి అయిదు ట్యాబ్లెట్లు (రోజుకు ఒకటి చొప్పున) దీన్ని వినియోగించాలని సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని