వచ్చే మూడేళ్లలో రూ.1,000 కోట్లతో విస్తరణ
close

Updated : 12/05/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వచ్చే మూడేళ్లలో రూ.1,000 కోట్లతో విస్తరణ

గ్రాన్యూల్స్‌ ఇండియా ఎండీ కృష్ణ ప్రసాద్‌  
4వ త్రైమాసికంలో రూ.128 కోట్ల నికరలాభం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.799 కోట్ల ఆదాయాన్ని, రూ.128 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.600 కోట్లు, నికరలాభం రూ.92 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆదాయం 33 శాతం, నికరలాభం 38 శాతం పెరిగినట్లు అవుతోంది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2020-21) పూర్తికాలానికి రూ.3,238 కోట్ల ఆదాయాన్ని, రూ.549 కోట్ల నికరలాభాన్ని గ్రాన్యూల్స్‌ ఇండియా నమోదు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.2,599 కోట్లు, నికరలాభం రూ.335 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చినప్పుడు 2020-21లో ఆదాయం 25%, నికరలాభం 64 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్‌ ఇంటర్మీడియేట్స్‌ (పీఎఫ్‌ఐ) విభాగంలో 49% వృద్ధి నమోదైంది. ఏపీఐ అమ్మకాలు 12%, ఫినిష్డ్‌ డోసేజెస్‌ అమ్మకాలు 25% పెరిగాయి. ఎంఈఐఎస్‌ స్కీమును కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఉపసంహరించుకోవటం వల్ల రూ.39 కోట్ల మేరకు లాభం తగ్గినట్లు కంపెనీ పేర్కొంది.
వచ్చే మూడేళ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించటానికి రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా వెల్లడించింది. దీనివల్ల ఫినిష్డ్‌ డోసేజెస్‌, ఏపీఐ విభాగాల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని పేర్కొంది. వాటాదార్లకు ఒక్కో షేర్‌కు 75 పైసల చొప్పున తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. కొత్త ఔషధాలు విడుదల చేయటం, అమ్మకాలు పెంచుకోవటం వల్ల గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి నమోదు చేయగలిగినట్లు గ్రాన్యూల్స్‌ ఇండియా ఎండీ కృష్ణ ప్రసాద్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని