88888 88888 కి ముకేశ్‌ డయల్‌ చేస్తున్నారా? - Telugu news Reliance in talks to buy Justdial
close

Updated : 16/07/2021 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

88888 88888 కి ముకేశ్‌ డయల్‌ చేస్తున్నారా?

స్థానిక వ్యాపార సంస్థల ఫోన్‌ నెంబర్లు, ఇతర వివరాలు తెలిపే జస్డ్‌ డయల్‌ (88888 88888)ను సొంతం చేసుకునేందుకు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) చర్చలు జరుపుతోందని సమాచారం. వ్యవస్థాపక ప్రమోటర్ల నుంచి 800-900 మిలియన్‌ డాలర్ల (రూ.6,000-6,750 కోట్లు) మొత్తానికి కొనుగోలు చేయాలన్నది ఆర్‌ఐఎల్‌ ఆలోచన. ఇది సాకారమైతే, జస్ట్‌ డయల్‌ వద్ద ఉన్న వ్యాపారుల వివరాలన్నీ రిలయన్స్‌కు చేరతాయి. జస్ట్‌ డయల్‌ ఎండీ వి.ఎస్‌.ఎస్‌. మణి, ఆయన కుటుంబానికి కంపెనీలో 35.5 శాతం వాటా ఉంది. ఈ వాటా విలువ రూ.2387.9 కోట్లుగా ఉంది. ముందుగా వీరి వాటా కొనుగోలు చేసి, ఆ తర్వాత ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా మరో 26 శాతం వాటా స్వాధీనం చేసుకోవాలన్నది రిలయన్స్‌ ప్రణాళికగా చెబుతున్నారు. ఓపెన్‌ ఆఫర్‌కు పూర్తి స్థాయి స్పందన లభిస్తే రిలయన్స్‌కు జస్ట్‌డయల్‌లో 60 శాతం వాటా లభిస్తుంది. తదుపరి కంపెనీలో జూనియర్‌ భాగస్వామిగా మణి ఉంటారని సమాచారం. ఏప్రిల్‌ నుంచి ఇరు వర్గాలు చర్చల్లో ఉన్నాయని తెలిపింది. సగటున మూడు నెలల్లో 15 కోట్ల మంది ఈ వెబ్‌సైట్‌ను దర్శిస్తున్నారు. గతంలో టాటా సన్స్‌ సైతం ఈ కంపెనీతో చర్చలు జరిపినప్పటికీ అవి ఫలవంతం కాలేదు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని