అక్టోబరు 1 నుంచి ట్రేడింగ్‌-డీమ్యాట్‌
close

Published : 24/07/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్టోబరు 1 నుంచి ట్రేడింగ్‌-డీమ్యాట్‌

ఖాతాలకు నామినేషన్‌ సదుపాయం: సెబీ

దిల్లీ: అక్టోబరు 1 నుంచి కొత్త ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలు తెరిచే మదుపర్లకు నామినేషన్‌ వివరాలు ఇవ్వడం/ఇవ్వకపోవడం అనే అవకాశాన్ని ఇవ్వనున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. నామినేషన్‌ కు నామినేషన్‌ పత్రం, నిలిపివేసేందుకు డిక్లరేషన్‌ పత్రాన్ని విడుదల చేసింది. ఇప్పటికే ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలున్న అర్హులైన వారు 2022 మార్చి 31లోపు నామినేషన్‌ ఎంపిక వివరాలు సమర్పించాలని, లేదంటే ఆయా ఖాతాలు స్తంభింపజేస్తామని తెలిపింది. కొత్త నిబంధనల (ఫ్రేమ్‌వర్క్‌) ప్రకారం.. ధ్రువీకరణ పత్రాలు అందిన తర్వాతే ట్రేడింగ్‌ మెంబర్లు, డిపాజిటరీ పార్టిసిపెంట్లు (డీపీలు) 2021 అక్టోబరు 1 నుంచి కొత్త ట్రేడింగ్‌, డీమ్యాట్‌ ఖాతాలను యాక్టివేట్‌ చేయాలని సెబీ పేర్కొంది. నామినేషన్‌, డిక్లరేషన్‌ పత్రాలపై ఖాతాదారు వెట్‌ సిగ్నేచర్‌ (సంతకం) ఉండాలని, విట్‌నెస్‌ (సాక్షి) అవసరం లేదని తెలిపింది. ఒకవేళ ఖాతాదారు వేలి ముద్ర (సంతకానికి బదులు) వేస్తే సాక్షి సంతకం ఉండాలని సూచించింది. ఆన్‌లైన్‌ నామినేషన్‌, డిక్లరేషన్‌ ఫామ్‌లపై కూడా ఇ-సైన్‌ సదుపాయంతో సంతకం చేయాలని, సాక్షి సంతకం అవసరం లేదని పేర్కొంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని