రాగి దిద్దుబాటు!
close

Published : 20/09/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాగి దిద్దుబాటు!

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం,  వెండి

పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.45,434 కంటే దిగువన ట్రేడయితే రూ.45,152; రూ.44,869 వరకు దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంది. అందువల్ల తక్కువ రిస్క్‌తో ట్రేడ్‌ చేసే వాళ్లు రూ.45,152 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.45,434 ఎగువన లాంగ్‌ పొజిషన్లకు మొగ్గుచూపొచ్చు.  * ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.13,982 కంటే పైన చలించకుంటే రూ.13,570; రూ.13,482 వరకు దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు. వెండి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.61,883 కంటే పైన కదలాడితే రూ.62,482; రూ.64,964 వరకు పెరుగుతుందని భావించవచ్చు.  

ప్రాథమిక లోహాలు

* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ అక్టోబరు కాంట్రాక్టును ఈవారం రూ.15,730 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.16,205; రూ.16,298 లక్ష్యాలతో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. * రాగి సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.734.75 కంటే పైన కదలాడకుంటే.. మరింతగా దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు. * సీసం సెప్టెంబరు కాంట్రాక్టును ఈవారం రూ.191.75 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.184.65; రూ.183.20 లక్ష్యాలతో షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. * జింక్‌ సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.261 కంటే పైన కదలాడకుంటే.. మరింతగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. రూ.252 దిగువకు వస్తే రూ.250; రూ.247 వరకు దిద్దుబాటు కావచ్చు. * అల్యూమినియం సెప్టెంబరు కాంట్రాక్టులో ఈవారం కొంత షార్ట్‌ సెల్లింగ్‌ చోటుచేసుకోవచ్చు. అందువల్ల లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు అధిక స్థాయిల వద్ద లాభాలను స్వీకరించడం మంచిది. * నికెల్‌ సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,518 కంటే పైన కదలాడకుంటే మరింతగా కిందకు దిగివస్తుందని భావించవచ్చు.

ఇంధన రంగం

* ముడి చమురు సెప్టెంబరు కాంట్రాక్టును ఈవారం రూ.5,163 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.5,196; రూ.5,216 స్థాయిలకు ఎగువన కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. * సహజవాయువు సెప్టెంబరు కాంట్రాక్టును ఈవారం రూ.398 దిగువన షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. అయితే గతవారం గరిష్ఠమైన రూ.414.80 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవడం మంచిది. * ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) సెప్టెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,166 కంటే పైన కదలాడకుంటే రానున్న రోజుల్లో దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుందని భావించవచ్చు. ఈ నేపథ్యంలో రూ.1,141; రూ.1,154 మధ్య కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.

వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.6,766 కంటే కిందకు రాకుంటే లాంగ్‌ పొజిషన్లు తీసుకోవడాన్ని కొనసాగించవచ్చు. అయితే ముగింపుపరంగా పైన చెప్పిన స్థాయి కంటే కిందకు వస్తేనే కాంట్రాక్టు దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు. * జీలకర్ర అక్టోబరు కాంట్రాక్టు ఈవారం రూ.14,786 కంటే పైన కదలాడకుంటే.. ప్రతికూల ధోరణిలో చలించే అవకాశం ఉంటుంది.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని