బుల్‌అబ్బాయ్‌ షష్టిపూర్తి నేడే!
close

Updated : 24/09/2021 04:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుల్‌అబ్బాయ్‌ షష్టిపూర్తి నేడే!

60,000 మైలురాయికి సమీపంలో సెన్సెక్స్‌
18000 పాయింట్లకు చేరువలో నిఫ్టీ
కొత్త జీవనకాల గరిష్ఠాలకు సూచీలు
ప్రపంచ మార్కెట్ల సానుకూలతలతో భారీ లాభాలు
రూ.3.16 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద

శుక్రవారం... భారత స్టాక్‌ మార్కెట్ల చరిత్రలో మరో మరపురాని రోజుగా నిలుస్తుందేమో!! సెన్సెక్స్‌ 60,000 మైలురాయిని అధిగమించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. గురువారం భారీ లాభాల నేపథ్యంలో సెన్సెక్స్‌ 60,000 పాయింట్లకు 115 పాయింట్లు దూరంలో నిలిచింది. ఈ రోజూ లాభాలొస్తే సెన్సెక్స్‌ ప్రయాణంలో ఓ అద్భుత ఘట్టం చోటుచేసుకోవడం ఖాయమే. అటు నిఫ్టీ కూడా 18000 పాయింట్ల చేరువలో కదలాడుతోంది. నేడు మరో 177 పాయింట్లు లాభపడిందంటే.. జంట సూచీలకు ఇది పండుగ రోజే అవుతుంది.

క రోజు విరామం తర్వాత సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. కొత్త శిఖరాలనూ అధిరోహించాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలో కొత్త చరిత్ర లిఖించేందుకు సిద్ధమయ్యాయి. ప్రధానంగా ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం సూచీల జోరుకు దోహదం చేసింది. చిన్న, పెద్ద, మధ్య అనే తేడా లేకుండా దాదాపు అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం గమనార్హం. సూచీల భారీ లాభాల్లో ఆర్‌ఐఎల్‌, జంట హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ఇంచుమించు సగం పాత్ర పోషించాయి.


ఆద్యంతం దూకుడే..

దయం సెన్సెక్స్‌ 59,358.33 పాయింట్ల వద్ద లాభాలతోనే ఆరంభమైంది. ఆ తర్వాత ఆ దూకుడును  కొనసాగించిం 59,957.25 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరింది. చివరకు 958 పాయింట్ల లాభంతో 59,885.36 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 276.30 పాయింట్లు పెరిగి 17,822.95 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు రెండు కొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగియడం గమనార్హం. మదుపర్ల సంపద కూడా గణనీయంగా రూ.3.16 లక్షల కోట్లు పెరిగి రూ.2,61,73,374.32 కోట్లకు చేరింది. ఇది జీవనకాల గరిష్ఠ స్థాయి. రూపాయి మారకపు విలువ 23 పైసలు పెరిగి 73.64 వద్ద ముగిసింది.


అమెరికా.. చైనా.. భారత్‌

దేశీయ మార్కెట్లు భారీ లాభాలు రావడానికి ప్రధానంగా అమెరికా, చైనా, భారత్‌కు సంబంధించిన పరిణామాలు దోహదం చేశాయి. అవేంటంటే..

* ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనలను 2022 మధ్యకల్లా ఆపేస్తామని, నవంబరు నుంచి బాండ్ల కొనుగోలును తగ్గిస్తామని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించడం.

* సంక్షోభంలో చిక్కుకుపోయి, ప్రపంచ మార్కెట్లలో ఆందోళన పెంచిన చైనా స్థిరాస్తి దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌ బాండ్లకు వడ్డీ చెల్లిస్తామని ప్రకటించడం.

* భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్‌లు వేసే కార్యక్రమం కూడా వేగవంతం కావడం.


జోరులోనూ ఆరు బేజారు..

సెన్సెక్స్‌ భారీ లాభాలను నమోదుచేసినప్పటికీ.. సూచీలోని 30 షేర్లలో ఆరు డీలాపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ (1.07%), నెస్లే ఇండియా (0.44%), ఐటీసీ (0.41%), హిందుస్థాన్‌ యునిలీవర్‌ (0.11%), భారతీ ఎయిర్‌టెల్‌ (0.08%), అల్ట్రాటెక్‌ సిమెంట్‌ (0.08%) నష్టపోయాయి. అత్యధికంగా బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు 5.15% పెరిగింది. ఎల్‌అండ్‌టీ (3.46%), హెచ్‌డీఎఫ్‌సీ (3.11%), యాక్సిస్‌ బ్యాంక్‌ (3.04%), ఎస్‌బీఐ (2.46%), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (2.38%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (2.33%) షేర్లు రాణించిన వాటిల్లో ఉన్నాయి.


ఆర్‌ఐఎల్‌ జీ రూ.16 లక్షల కోట్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ ఇంట్రాడేలో రూ.16 లక్షల కోట్లను అధిగమించింది. గురువారం షేరు బీఎస్‌ఈలో 2.43% లాభంతో రూ.2,489.65 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 2.72%  పెరిగి రూ.2,496.95ను చేరింది. దీంతో మార్కెట్‌ విలువ రూ.16 లక్షల కోట్ల పైకి చేరింది. అయితే ట్రేడింగ్‌ ముగిసే నాటికి ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.15,78,299.46 కోట్ల వద్ద ముగిసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని