44% పెరిగిన సిమెంటు ఉత్పత్తి
close

Published : 17/10/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

44% పెరిగిన సిమెంటు ఉత్పత్తి

2021-22లో 12% వృద్ధికి అవకాశం

ఇక్రా నివేదిక

దిల్లీ: గత ఐదు నెలల్లో సిమెంటు ఉత్పత్తి ఏడాదిక్రితంతో పోలిస్తే 44 శాతం పెరిగింది. అయితే కొవిడ్‌-19 ముందుతో పోలిస్తే (2019 ఏప్రిల్‌- సెప్టెంబరు) వృద్ధి 2 శాతమేనని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తన తాజా నివేదికలో  వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా సిమెంటు ఉత్పత్తి సుమారు 12 శాతం పెరిగి 332 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 2022-23లో 358 మిలియన్‌ టన్నుల మేర సిమెంటు ఉత్పత్తి కావొచ్చని తెలిపింది. గిరాకీ పుంజుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలు పెరగడం, మౌలిక సదుపాయాల కార్యకలాపాలు కూడా వేగవంతం కావడం ఇందుకు దోహదం చేయొచ్చని ఇక్రా తన నివేదికలో తెలిపింది. 2021-22 తొలి అర్ధభాగంలో సిమెంటు ధరలు ఏడాదిక్రితంతో పోలిస్తే 4 శాతం మేర పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని నెలలుగా ముడి సరకు వ్యయాలు, ఇంధనం, విద్యుత్‌ ఖర్చులు పెరగడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. బొగ్గు ధరలు 103 శాతం మేర పెరగగా.. పెట్‌కోక్‌ 87 శాతం, డీజిల్‌ 20 శాతం మేర ప్రియం అయ్యాయని తెలిపింది. సిమెంటు రంగంలో 12 నమోదిత కంపెనీల మొత్తం ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని