సంక్షిప్త వార్తలు
close

Published : 20/10/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

రూ.297 కోట్లు సమీకరించనున్న శిల్ప మెడికేర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఔషధ కంపెనీ శిల్ప మెడికేర్‌ రూ.297.51 కోట్ల మూలధన నిధులు సమీకరించనుంది. దీనికి అనుగుణంగా ఒక్కొక్కటీ రూ.1 ముఖ విలువ గల 52.75 లక్షల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ పద్ధతిలో జారీ చేయనుంది. ఒక్కో షేరును రూ.564 ధరకు కేటాయిస్తుంది. ప్రధానంగా మలబార్‌ ఇండియా ఫండ్‌, థింక్‌ ఇండియా ఆపర్చునిటీస్‌ మాస్టర్‌ ఫండ్‌, బ్లూ డైమెండ్‌ ప్రాపర్టీస్‌, హిప్నాస్‌ ఫండ్‌ ఈ షేర్లు తీసుకుంటున్నాయి. దేశీయ స్టాక్‌మార్కెట్లో అగ్రశ్రేణి ఇన్వెస్టర్లలో ఒకరైన మధుసూధన్‌ కేలా 2 లక్షల ఈక్విటీ షేర్లు తీసుకుంటున్నారు. ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ పద్ధతిలో ఈ షేర్లను జారీ చేయడానికి వాటాదార్ల అనుమతి తీసుకునే నిమ్తితం శిల్ప మెడికేర్‌ నవంబరు 10న వాటాదార్ల అసాధారణ సమావేశం నిర్వహించనుంది.


డాక్టర్‌ రెడ్డీస్‌ ‘లెనలిడోమైడ్‌’ క్యాప్సూల్‌కు అమెరికాలో తుది అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: మల్టిపుల్‌ మైలోమా, మైలోడిస్‌ప్లాస్టిక్‌ సిండ్రోమ్‌ అనే లక్షణాల గల కేన్సర్‌ వ్యాధులను అదుపు చేసేందుకు వాడే లెనలిడోమైడ్‌ క్యాప్సూల్స్‌ను అమెరికాలో విక్రయించటానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి తుది అనుమతి సంపాదించింది. ఈ క్యాప్సూల్స్‌ను 2.5 ఎంజీ, 20 ఎంజీ మోతాదుల్లో విక్రయించడానికి తుది అనుమతి వచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. సెల్‌జీన్‌ అనే కంపెనీకి చెందిన ‘రెవ్లీమిడ్‌’ బ్రాండుకు ఇది జనరిక్‌ ఔషధం. సెల్‌జీన్‌తో ఉన్న పేటెంట్‌ వివాదాన్ని గత ఏడాది సెప్టెంబరులో డాక్టర్‌ రెడ్డీస్‌ పరిష్కరించుకుంది. వచ్చే ఏడాది మార్చి తర్వాత అమెరికాలో లెనలిడోమైడ్‌ జనరిక్‌ ఔషధాన్ని పరిమిత పరిమాణంలో డాక్టర్‌ రెడ్డీస్‌ విక్రయించవచ్చు.


రూ.18 లక్షల కోట్లకు సేవల ఎగుమతులు!

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ సేవల రంగ ఎగుమతులు 240 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.18 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉందని సర్వీసెస్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఈపీసీ) అంచనా వేసింది. ప్రొఫెషనల్‌- మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సేవలు, దశ్య-శ్రవణ మాధ్యమ, సరకు రవాణా సేవలు, టెలికాం విభాగాలు మంచి పనితీరు నమోదుచేస్తున్నాయని పేర్కొంది. 2021-22 మొదటి అయిదు నెలల్లో సేవల రంగ ఎగుమతులు  14 శాతం వృద్ధితో 95 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఎస్‌ఈపీసీ ఛైర్మన్‌ మానెక్‌ దావర్‌ అన్నారు. ఈ ఏడాది చివరకు పర్యాటక రంగం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే సేవల రంగం విలువ మరింత పెరగొచ్చని పేర్కొన్నారు. 2020-21లో సేవల రంగ ఎగుమతులు 3 శాతం తగ్గి 206 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.15.45 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని