18,300 దిగువకు నిఫ్టీ
close

Updated : 21/10/2021 06:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

18,300 దిగువకు నిఫ్టీ

సమీక్ష

దుపర్ల లాభాల స్వీకరణ రెండో రోజూ కొనసాగింది. ఇటీవల బాగా పెరిగిన షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురు కావడంతో నిఫ్టీ కీలకమైన 18,300 పాయింట్ల దిగువన ముగిసింది. అధిక విలువలకు చేరిన స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు రాణించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 47 పైసలు బలపడి దాదాపు 2 వారాల గరిష్ఠమైన 74.88 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్‌, టోక్యో లాభపడగా, షాంఘై, సియోల్‌ నష్టపోయాయి. ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 61,800.07 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 61,880.36 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. తదుపరి అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుని, ఒకదశలో 61,109.29 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 456.09 పాయింట్ల నష్టంతో 61,259.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 152.15 పాయింట్లు కోల్పోయి 18,266.60 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,209.35- 18,458.30 పాయింట్ల మధ్య కదలాడింది.

* ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలతో ఏసీసీ షేరు ఇంట్రాడేలో 5% పెరిగి రూ.2,357.95 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 0.79% లాభపడి రూ.2,263.20 వద్ద ముగిసింది.

* ర్యాలీస్‌ ఇండియా షేరు 7 శాతం నష్టంతో రూ.282.45 దగ్గర స్థిరపడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 23 డీలాపడ్డాయి. టైటన్‌ 2.97%, హెచ్‌యూఎల్‌ 2.63%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.39%, ఎన్‌టీపీసీ 2.27%, ఎల్‌ అండ్‌ టీ 2.13%, పవర్‌గ్రిడ్‌ 2.12%, ఎం అండ్‌ ఎం 1.92%, టాటా స్టీల్‌ 1.80%, బజాజ్‌ ఆటో 1.63%, సన్‌ఫార్మా 1.52% మేర నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 4.03%, ఎస్‌బీఐ 2.35%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.56% లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 2428 షేర్లు నష్టాల్లో ముగియగా, 887 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 112 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని