చిన్న షేర్లకు పెద్ద కష్టం
close

Published : 24/10/2021 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్న షేర్లకు పెద్ద కష్టం

10 నుంచి 22 శాతం పతనం

స్టాక్‌మార్కెట్‌ సూచీలు రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత గతవారంలో వచ్చిన కొద్దిపాటి ‘కరెక్షన్‌’ లో చిన్న, మధ్య తరగతి కంపెనీల షేర్లు (స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌) బాగా నష్టపోయాయి. ఈ విభాగాలకు చెందిన షేర్ల ధరలు 10 శాతం నుంచి 22 శాతం వరకు పతనం కావటం గమనార్హం. అదే సమయంలో సూచీలు పెద్దగా నష్టపోలేదు. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 4 శాతం, 5 శాతం మాత్రమే నష్టపోయాయి. కానీ కొన్ని చిన్న, మధ్య తరగతి కంపెనీల షేర్ల ధరలు ఎంతో అధికంగా పడిపోయాయి. ఈ కంపెనీల్లో శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌, డీసీఎం శ్రీరాం, ఎంఈపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌, బాలాజీ అమైన్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌, ఆంటోనీ వేస్ట్‌ హ్యాండ్లింగ్‌ సెల్‌, బలరాంపూర్‌ చీనీ మిల్స్‌, ఎన్‌ఎల్‌సీ ఇండియా, పానేషియా బయోటెక్‌, గ్లోబస్‌ స్పిరిట్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, లారస్‌ ల్యాబ్స్‌... తదితర కంపెనీలు ఉన్నాయి.

ఇవీ కారణాలు
సూచీలు గరిష్ఠస్థాయిలో ఉండటానికి తోడు హెచ్చుతగ్గులు అధికమైన కారణంగా సంస్థాగత మదుపరులు పెద్దఎత్తున అమ్మకాలకు దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంలో బాగా ధరలు పెరిగిన కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోందని మార్కెట్‌ నిపుణులు వివరిస్తున్నారు. దీనికి తోడు కార్పొరేట్ల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు పెద్ద ఆకర్షణీయంగా లేవు. ముడిపదార్థాల ధరలు పెరిగిన ఫలితంగా లాభదాయకత తగ్గిన విషయం స్పష్టమవుతోంది. సూచీలు సైతం ఒత్తిడి ఎదుర్కొంటూ, దిద్దుబాటుకు అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తున్నందున, మదుపరుల్లో అప్రమత్తత పెరిగిందని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. ఎక్కడో ఒక దగ్గర సూచీలు స్థిరపడి మళ్లీ సానుకూలత ఏర్పడే వరకు చిన్న, మధ్యస్థాయి కంపెనీల షేర్లు సైతం అమ్మకాల ఒత్తిడికి లోనవుతాయని, అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా వ్యవహరించటమే మేలని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, లోహాల ధరలు పెరిగిపోవడం, ముడిపదార్థాల ధరలు అధికంగా ఉండటం, ముడిచమురు ధర పైపైకి వెళ్తుండటం.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా రంగాల కంపెనీల పనితీరుపై అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాల ఆధారంగా షేర్ల ధరల్లో కదలిక ఉంటుందని స్పష్టమవుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని